నాటో దేశాలను భయపెడుతున్న రష్యా?

నాటో దేశాలకు రష్యా కు మధ్య యుద్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి. బెలారస్ లో ఉన్న వ్యాగనర్ సైన్యం పని పట్టేందుకు రష్యా అధ్యక్షుడు తన సైన్యాన్ని పంపిస్తున్నాడని తెలుస్తోంది. దీంతో బెలారస్ లోనే ఉన్న వ్యాగనర్ సైన్యం, ఇటు రష్యా సైన్యం, అటు నుంచి వస్తున్న నాటో దేశాల సైన్యంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.


పోలండ్ సరిహద్దుల్లో నాటో సైన్యం, బెలారస్ సరిహద్దుల్లో రష్యా సైన్యం, బెలారస్ లో వ్యాగనర్ సైన్యం ఇలా అన్ని ఒక్కచోట చేరడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే సందేహం నెలకొంది. రష్యాను ఎదుర్కొనే సత్తా నాటో దేశాలకు ఉంది. ఉక్రెయిన్ వద్ద సరైన ఆయుధాలు లేకపోవచ్చు. కానీ నాటో సభ్య దేశాల వద్ద భారీగా ఆయుధాలు, మిస్సైల్స్, అణు బాంబులు కూడా ఉన్నాయి. రష్యా గనక ఏమాత్రం నాటో దేశాలపై దాడి చేయాలని ప్రయత్నించినా ఆ దేశాలు కూడా స్పందించేలా ఉన్నాయి.


దీంతో మూడో ప్రపంచ యుద్ధం పొంచి ఉంది. మూడో ప్రపంచ యుద్దం గనక వస్తే ప్రపంచంలో ఏమైనా జరగొచ్చు. అసలే అణ్వస్త్రాలు ఉన్న దేశాలు కాబట్టి యుద్ధం జరగకుండా ఉంటేనే మంచిదని ప్రార్థించాలి. రష్యా, వ్యాగనర్ సైన్యాన్ని, ఉక్రెయిన్ పై భీకర దాడులకు సిద్ధమవుతుందన్న సమాచారంతో నాటో సైన్యం కూడా పోలండ్ సరిహద్దుల్లో రెడీగా ఉంది. మరి రష్యా, ఉక్రెయిన్ యుద్దం కాస్త రూపు మార్చుకుని వేరే పంథాలోకి వెళ్లిపోతుంది.


నాటో దేశాలు, రష్యా యుద్ధంగా మారితే ఊహించేందుకు కూడా భయానకంగా మారబోతుంది. కాబట్టి ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఎంత ముందుగా ముగిస్తే అంత మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. లేకపోతే రాబోయే రోజుల్లో భీకరమైన యుద్ధం జరిగి ప్రపంచ దేశాలు అల్లకల్లోలం జరిగే అవకాశం ఉంది. కాబట్టి రష్యా అధ్యక్షుడు పుతిన్, నాటో దళాల సైనికాధికారి కూర్చొని మాట్లాడుకుని సమస్యకు శాంతియుత పరిష్కారం కనుక్కోవాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: