మహారాష్ట్ర నుంచి కేసీఆర్‌ పోటీ.. నిజమేనా?

సీఎం కేసీఆర్ 2014, 2019 సంవత్సరంలో రెండు సార్లు తెలంగాణ నుంచి సీఎం అయ్యారు. అప్పటి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి దేశవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే తెలంగాణలో డిసెంబరు లో వచ్చే ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో మరో సారి సీఎం పదవి చేపట్టాలని భావిస్తున్నారు. అదే సమయంలో రాబోయే ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీని వివిధ రాష్ట్రాల్లో పోటీ చేయించాలని అనుకుంటున్నారు.

ముఖ్యంగా మహారాష్ట్రలో స్వయంగా సీఎం కేసీఆరే ఎంపీగా పోటీ చేస్తారని మహారాష్ట్ర మీడియా, నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే ఇక్కడ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకంతో కేసీఆర్ ఉన్నారు. అధికార బలాన్ని ఉపయోగించి ఎంపీ ఎలక్షన్లకు పోవాలని కృత నిశ్చయంతో ఉన్నారు. తెలంగాణలో పార్టీని అధికారాన్ని కొడుకు కేటీఆర్ కు అప్పగించి మహారాష్ట్ర నుంచి ఎంపీగా పోటీ చేయడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని అనుకుంటున్నారు.

దీంతో పాటు అక్కడ గెలిస్తే మంచి ఊపు వస్తుంది. కేంద్రంలో కూడా బీఆర్ఎస్ కు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు అవసరమొస్తే కేసీఆర్ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. కేంద్రంలో చక్రం తిప్పవచ్చనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలు చేయడం అక్కడి నాయకులను పార్టీలో చేర్చుకోవడం అక్కడ బలా బలాలను తెలుసుకోవడం.. పార్టీకి ఎలా ఊపు తీసుకురావాలో, తెలంగాణలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్రలో కూడా అమలు చేస్తామని చెప్పడం.. దేశ వ్యాప్తంగా రైతు బంధు తీసుకొస్తామని చెప్పడం తదితర అంశాలతో అక్కడి ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణకు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడం.. హైదరాబాద్ నుంచి కూడా పెద్దగా దూరం లేకపోవడంతో సీఎం కేసీఆర్ ముందుగా మహారాష్ట్రలో పాగా వేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో కేటీఆర్, మహారాష్ట్రలో కేసీఆర్ రాజకీయాలను రక్తి కట్టించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: