జగన్‌ను కలవరపెడుతున్న పవన్‌ వ్యూహం?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను రాజకీయంలో కి వచ్చినప్పుడు నుండి కూడా జగన్ ను, జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. వారాహి రథం ఎక్కి గత నెల రోజులుగా కోస్తా జిల్లాల్లో, ఇంకా విశాఖలో సుడిగాలిలా పర్యటించారు పవన్ కళ్యాణ్. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ విధానాలపై ఒక రకంగా పెద్ద యుద్ధమే చేసుకుంటూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన దూకుడుకు కొంత గ్యాప్ ఇచ్చినట్లు సమాచారం.

ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మాటల దాడికి, ప్రసంగాల వేడికి తట్టుకోలేక ఇళ్ళలో ఉండిపోయిన  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్ ప్రసంగాల ప్రభావం రాబోయే ఎలక్షన్ల పై పడబోతుందేమో అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.

ఇవన్నీ చూస్తున్న జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఏమిటి అని వాళ్ల పార్టీకి సంబంధించిన  శ్రేణుల్లోనే ఒక సందేహం. పవన్ కళ్యాణ్ దూకుడు ఇలాగే కొనసాగుతూ ఉంటే ఆ తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది అని అంటున్నారు. వైఎస్ఆర్సిపికి కొంతమంది నేతలకు సీట్లను ఇవ్వాలని లేదు.

దాంతో ఇప్పటికే 20,30 మంది వైసీపీ నేతలతో టచ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్లకి సీట్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళితే తాము గెలుస్తామో లేదో అనే సందేహాన్ని వ్యక్తం  చేస్తున్నాయి వైసిపి  శ్రేణులు. ఒకవేళ జనసేన గాని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తే అప్పుడు తమ గెలుపుకు ఢోకా లేదని వాళ్ళ విశ్వాసం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: