ఆ నియోజకవర్గం.. జనసేన ఖాతాలో పడినట్టేనా?
ఈయన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు. గతంలో ఆమంచి శ్రీనివాస్ చీరాలలో దందాలు జరిపే వారిని అంటున్నారు. అయితే జనసేన పార్టీ నేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కు అటువంటి నెగటివ్ ఇమేజ్ లేదు. కాబట్టి ఇప్పుడు ఆమంచి శ్రీనివాస్ కూడా తన పాత విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తన పాత విధానాన్ని మార్చుకొని ప్రజాస్వామ్య బద్దంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఆయనకు.
సాధారణంగా ఏ నియోజకవర్గంలోనైనా నెగిటివ్ ఇమేజ్ ఉన్న వాళ్ళు గెలవడం కష్టమే. దీనికి ఉదాహరణ కరణం బలరాం, పోతుల సునీత. కరణం బలరాం కూడా అలాంటి ఇమేజ్ ఉండడం వల్లే తన సొంత నియోజకవర్గంలో ఆయనని అక్కడ ప్రజలు ఓడించారు. దాంతో కరణం బలరాం చీరాల కి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు చీరాలలో ఆమంచి శ్రీనివాస్ ఈ కరణం బలరాం ని ఢీ కొట్ట బోతున్నట్లుగా తెలుస్తుంది.
ఇప్పుడు తన చెడ్డ పేరుని అధిగమించేలా సమన్వయంతో, సంయమనంతో ఆమంచి శ్రీనివాస్ ముందుకు వెళ్తే ఆయనకు ప్రజాక్షేత్రంలో మంచి నాయకునిగా పేరు వస్తుంది. చీరాలలో ఆమంచి శ్రీనివాస్ అంటే తెలియని వాళ్ళు దాదాపుగా ఉండరు అని అంటారు. అలాంటి ఆమంచి శ్రీనివాస్ భవిష్యత్తులో ఉన్నత స్థాయి నాయకుడిగా ఎదిగేలా కృషి చేస్తే ఆయన వల్ల జనసేన పార్టీకి కూడా మరింత పేరు వస్తుందని రాజకీయ నిపుణులు అంటున్నారు.