ఆ డిపాజిట్లతో రామోజీరావుకు కష్టాలు తప్పవా?

మార్గదర్శి ఇప్పటి వరకు చెబుతున్నది ఒకటి ఇప్పుడు బయటకు తెలుస్తున్న వివరాలు వేరేలా ఉంటున్నాయని కథనాలు వస్తున్నాయి. ఎవరైనా చిట్టి పాడుకున్నాక వాటిని డబ్బులు తిరిగి కట్టలేకపోతే డిపాజిట్ చేసుకుంటామని చెప్పేవారు. అయితే అత్యవసరంగా ఉన్న వారే చిట్టి పాట పాడి తీసుకుంటారు. కానీ షూరిటీ ఇవ్వలేదనే కారణంతో దాన్ని డిపాజిట్ రూపంలో ఉంచుకుంటున్నారు. ఇలా కోటి రూపాయాలకు పైగా డిపాజిట్ చేసిన వారు దాదాపు 800 మంది ఉన్నారని సమాచారం.


డిపాజిట్ డైరెక్టుగా తీసుకోవడం క్రైమ్ కిందకు వస్తుంది. అలా తీసుకోవాలంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కింద ఉండాలి. లేదంటే ఫైనాన్స్ కార్పొరేషన్ కింద రిజిష్టర్ అవ్వాలి. చిట్ పండ్స్ అలా చేయడానికి వీలులేదు. కోటి రూపాయల చిట్టి పాడుకున్న వారు షురిటీ చూపించకుండా అక్కడే డిపాజిట్ ఉంచుకుంటున్నారు. కోటి రూపాయల చిట్టి పాడుకున్న వారు షూరీటీ చూపించలేడంటే ఇక్కడ చిట్టి వేసిన వ్యక్తిది తప్పా.. మార్గదర్శిగా అనే సందేహం కలుగుతుందన్న వాదన వస్తోంది.


800 మంది పైగా కోటి రూపాయల పైబడి ఉన్నారు. వీరు ఇన్ కం ట్యాక్స్ రిటర్న్ లో చూపిస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అది కూడా క్యాష్ డిపాజిట్ ఉండకూడదు. ఇంకో విషయం చిట్టీ డబ్బులు అయి ఉండాలి. అయితే మార్గదర్శి చిట్ పండ్స్ ఉదంతం కొత్త కొత్త కోణాలను బయటకు తీసుకొస్తుంది. ముఖ్యంగా మార్గదర్శి చిట్ పండ్స్ లో చిట్టిలు వేసిన వారికి షూరిటీ తప్పక ఉండాల్సిందే. అందులో గవర్నమెంట్ ఉద్యోగుల షూరిటీని కూడా ఇద్దరినో ముగ్గురినో తీసుకుంటారు.


చిట్టీ వేసిన వారు అవసరానికి తీసుకోవాలని అనుకుంటే షూరిటీ మాత్రం చూపించకపోతే ఆ డబ్బులను డిపాజిట్ రూపంలో అట్టి పెట్టుకోవడంపై వివాదం జరుగుతోంది. రామోజీ రావు, మార్గదర్శి ఏండీ శైలజ కిరణ్, ఈ విషయమై ఎలాంటి వివరణ ఇస్తారోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: