ఆ నిర్ణయంతో బ్రాహ్మణుల మనసు గెలిచిన జగన్‌?

బ్రాహ్మణ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీకి మధ్య విభేదాలు ఉన్నాయని అంటారు. ఈ విభేదాలు కూడా ఇప్పటివి కావు. ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పటి కాలం నుండి ఈ విభేదాలు ఉన్నట్లుగా సమాచారం. ఎన్టీఆర్ తాను అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన కరణముల వ్యవస్థను రద్దు చేశారు. అంతే కాకుండా ఈ విభేదాలు రావడానికి అసలు కారణం భూములకు సంబంధించిన అంశం కూడా ఒకటని అంటారు.

గతంలో ప్రభుత్వ భూములను ఈ కరణములు అనే బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్లు వివిధ సామాజిక వర్గాల వారికి ఇచ్చేస్తూ ఉండేవారని సమాచారం. అయితే ఈ ఉచిత భూములను  కరణములు అలా పంచేస్తూ ఉండడం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి నచ్చలేదని సమాచారం. కమ్మ సామాజిక వర్గం వారు సాధారణంగానే మంచి ఆలోచనా పరులు అంటూ ఉంటారు. నీటి పల్లం ఎటు వెళ్తుందో గమనించి ఆ ప్రాంతాలలో వీళ్లు భూములు కొని వ్యవసాయాన్ని చేయించే వారిని సమాచారం.

ఈ కమ్మ సామాజిక వర్గం వారు ఆ వ్యవసాయ భూముల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలందరితోనూ పనులు చేయించుకునే వారు అన్నట్లుగా తెలుస్తుంది. అలా వాళ్ళు తక్కువ ధరకు వచ్చే భూములు అన్నిటిని కొని వ్యవసాయం చేయడం వల్ల, వ్యాపారం చేయడం వల్ల  ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకున్నారని అంటారు. అయితే ఈ కరణములు అనే బ్రాహ్మణులు ఇలా భూములను పంచి పెట్టేయడం  కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి నచ్చేది కాదు అని అంటారు.

వంశపారంపర్య ధర్మకర్తలకు అలాగే అర్చకులకు మాత్రమే ఐదు లక్షల రూపాయల ఆదాయం వచ్చే దేవాలయాలను అప్పగించడం అనే చట్ట సవరణ జగన్ ప్రభుత్వం మాత్రమే చేయగలిగిందని అభినందిస్తున్నారు. 1987లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి కర్ణముల పైన కొందరు చట్టం చేయించారని సమాచారం. అయితే ఇన్నాళ్లకు ఓట్ల కోసమే జగన్ ప్రభుత్వం చట్ట సవరణలు చేసిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: