ఏపీ: విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు జగన్ భరోసా..!
వైసిపి పార్టీ అధికారం నుంచి దిగిపోయే సమయంలో స్టీల్ ప్లాంట్లో 28 వేల మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే 10,500 మందిని తొలగించారంటూ విమర్శలు చేశారు. ఆ ఉపాధి కోల్పోవడంతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా మారిపోయిందంటూ తెలియజేశారు. అంతేకాకుండా తమ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల క్వార్టర్స్ లో కేవలం 50 పైసలకే యూనిట్ విద్యుత్ ఛార్జ్ చేసేవారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రూ. 8.50 పైసలకి పెంచారంటూ మండిపడ్డారు వైసీపీ అధినేత.
సీఎం చంద్రబాబు ,లోకేష్ పైన ఫైర్ అవుతూ ప్రమాదం జరిగిన కనీసం మానవత్వం చూపించాల్సిన ప్రభుత్వం ఇలా వ్యవహరించడం చాలా బాధాకరమంటూ విరుచుకుపడ్డారు. మృతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారంలో కూడా తండ్రి కొడుకులు పెద్ద డ్రామా చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ నుంచి రూ. 25 లక్షల రూపాయలు ఇస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటూ ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎల్జి పాలిమర్స్ ప్రమాద ఘటనకు బాధితులకు సైతం కోటి రూపాయలు పరిహారం ఇచ్చామంటూ తెలియజేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి కచ్చితంగా కోటి రూపాయలు పరిహారం ఇస్తామంటూ హామీ ఇచ్చారు.