మోదీ, బాబు బంధం.. ఆ మీటింగ్ తేల్చేస్తుందా?
నేషనల్ మీడియా అయినటువంటి రిపబ్లిక్ టీవీ ఇలా చెప్పడంతో అందరూ అదే నిజం అనుకునే పరిస్థితి ఏర్పడింది. లోక్ జనశక్తి పార్టీకి సంబంధించిన చిరాగ్ పాశ్వాన్ ను, అకాలీదళ్ పార్టీని, జెడిఎస్ పార్టీని, అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీని కూడా పిలిచారని కొన్ని మీడియా వర్గాలు అంటున్నాయి. మరి కొన్ని మీడియా వర్గాల నుండి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కూడా పిలిచారని వార్తలు వస్తున్నాయి.
అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విజయ సాయిరెడ్డి ఈ మధ్య ఈ విషయాన్ని ఖండించడం మనకు తెలిసిందే. మాకు ఎన్డీఏ నుండి ఎటువంటి పిలుపు రాలేదు అని ఆయన ఖచ్చితంగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే తెలుగుదేశం పార్టీని 18వ తారీఖున సమావేశానికి పిలిచినట్లుగా ఎన్డీఏ అధినేతలైన నడ్డా గాని, అమిత్ షా గాని, మోడీ గాని ఎవరూ ఇప్పటివరకు ధృవీకరించ లేదని వార్తలు వస్తున్నాయి.
అలాగే తెలుగుదేశం పార్టీ తరపు నుండి పార్టీ అధ్యక్షులు అయిన నారా చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ తమ పార్టీకి ఆహ్వానం అందినట్లుగా ధ్రువీకరించలేదు. అయితే ఎన్డీఏ కి సంబంధించిన మాధవ్ మేము తెలుగుదేశం పార్టీని ఆహ్వానించలేదని చెప్పినట్లుగా సమాచారం. అయితే ఈ నెల 18వ తేదీన సమావేశానికి వచ్చే వాళ్ళను బట్టి అసలు నిజం తెలుస్తుంది.