జగన్‌కు ఇది పెద్ద మైనస్ అవుతుందా?
సర్పంచులు మాత్రం నిరాశలో ఉన్నారు. సర్పంచులకు నిధులు రావడం లేదు. వాలంటీర్లకు కూడా జీతాలు పంచాయతీలే ఇవ్వాలని చెప్పడంతో కంగు తింటున్నారు. సర్పంచులుగా గెలవడానికి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా వాటి విషయం దేవుడెరుగు. కనీసం అభివృద్ది చేద్దామన్న నిధులు రాని పరిస్థితి ఉందని వాపోతున్నారు.
సర్పంచులు అయ్యాక ఎలాంటి పవర్ లేకపోవడంతో ఏ పని కావడం లేదు. ఏ పని కావాలన్నా కలెక్టర్ ఆర్డర్ పాస్ చేస్తేనే అవుతుంది. పోనీ చేసిన పనికి బిల్లులు తొందరగా మంజూరు చేస్తారంటే అది చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చే నిధులపై పూర్తి స్వతంత్రత సర్పంచులకు ఉండాలని కోరుతున్నారు.
ఇలా గతంలో పూర్తి స్వేచ్ఛ ఇస్తే చాలా మంది ఆ నిధులను వాడుకుని కనీసం కార్మికులకు కూడా డబ్బులు చెల్లించలేరనే ఆరోపణలున్నాయి. పాలన అస్తవ్యస్థంగా మారి ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని పంచాయతీల్లో పన్నులు కూడా సరిగా వసూలు కావు. గట్టిగా అడగలేరు. ఒక్కో ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పన్నులు వసూలు కానివి ఉన్నాయి. కాబట్టి గ్రామాల్లో సర్పంచులకు నిధులు ఇచ్చేస్తే పాలన అస్తవ్యస్థమయ్యే అవకాశం ఉంది. అందుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను అధీనంలో ఉంచుకుని పంచాయతీల్లో పాలనను కట్టడి చేస్తున్నాయి.