ఇప్పటికీ హాట్ టాపిక్‌గా చంద్రబాబు వ్యూహం?
కాబటట్టి చంద్రబాబు నాయుడు మాస్టర్ ఫ్లాన్ వేశారు. 1999 లో జరిగిన ఎన్నికల్లో లక్ష్మీ పార్వతి తెలుగు దేశంతో బీజేపీ పొత్తు పెట్టుకోకుండా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. దీంతో ఆ ఎన్నికల్లో టీడీపీకి 180 సీట్లు రావడం, కాంగ్రెస్ 90 సీట్లు, బీజేపీ 12, ఎంఐఎం 4, వచ్చాయి. ఇదే సమయంలో అన్న తెలుగు దేశం పార్టీ పెట్టిన హరి కృష్ణకు ఒక్క సీటు రాలేదు. లక్ష్మీ పార్వతి తెలుగు దేశం పార్టీకి కూడా ఒక్క సీటు రాకపోవడంతో పాటు కేవలం 0.4 శాతం ఓట్లు రావడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది.
99 లో లక్ష్మీ పార్వతి తెలుగు దేశం పార్టీ పూర్తిగా తుడుచు పెట్టుకుపోయింది. తర్వాత వెంకయ్య నాయుడికి, ఆద్వానీకి చంద్రబాబు దగ్గరవ్వడం బీజేపీతో 1999 లో పొత్తు పెట్టుకోవడం, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో బాబు పాత్ర ఉండటంలో టీడీపీ అంటే చంద్రబాబు అనే పేరు మారుమోగింది. ఇలా చేయడం వల్ల టీడీపీ అధికారంలో రావడమే కాకుండా బలమైన శక్తిగా ఆంధ్రలో మళ్లీ పునర్వైభవం సాధించగలిగింది.