డ్రగ్స్ అడ్డుకట్టకు.. తెలంగాణ మాస్టర్‌ ప్లాన్‌?

తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో డ్రగ్స్ వాడకం క్రమంగా పెరుగుతోంది. అనేక ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. అందుకే మాదకద్రవ్యాల వినియోగాన్ని నిరోధించేలా సరైన కార్యాచరణ రూపొందించేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోంది. ఇందుకు అన్ని శాఖల సమన్వయ కృషి అవసరమని, ఇందుకోసం బహుముఖ వ్యూహాన్ని అవలంభించేలా విద్య, వైద్య శాఖలతో కలిసి పనిచేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీస్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆలోచిస్తున్నారు.


డ్రగ్స్ అంశంపై ఇటీవల సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. డీజీపీ అంజనీకుమార్ తో పాటు ఇతర పోలీసు, ఇతర శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు, అక్రమ రవాణాను సమర్థంగా ఎదుర్కొనే లక్ష్యంతో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు.


ఈ మాదకద్రవ్యాల వినియోగాన్ని నిరోధించేలా సరైన కార్యాచరణ రూపొందించేందుకు అన్ని శాఖల సమన్వయ కృషి అవసరం. నిబంధనలకు విరుద్ధంగా దేశంలో ఉంటున్న విదేశీయులను వెనక్కు పంపేందుకు కేంద్రం తగిన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. అంతే కాదు..  సర్ఫేస్ వెబ్, డార్క్ వెబ్ పై పర్యవేక్షణ అవసరం. సైకోట్రోపిక్ పదార్ధాల దుర్వినియోగాన్ని అరికట్టడం, ప్రీకర్సర్ రసాయనాల మళ్లింపు నివారణపై దృష్టి పెట్టాల్సి ఉంది.


అలాగే ఫార్మా ఉత్పత్తి యూనిట్లు, కెమికల్ లేబొరేటరీలపై పర్యవేక్షణ పెంచాలి.  అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డీఅడిక్షన్‌, రీహాబిలిటేషన్‌ సెంటర్లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. కళాశాలల్లో యాంటీ డ్రగ్స్‌ క్లబ్స్ ఏర్పాటు చేయాలి.  డ్రగ్స్‌ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. 2021, 2022, 2023 సంవత్సరాల్లో హైదరాబాద్ లోని రహస్య ప్రయోగశాలలను ఛేదించారు. వాటిలో చాలా ఎక్కువ పరిమాణంలో ఆల్ప్రజోలం స్వాధీనం చేసుకున్నారు. అందుకే ఇలాంటి వాటిపై దృష్టి సారించి డగ్ర్ వాడకాన్ని వ్యూహాత్మకంగా కట్టడి చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: