కేసీఆర్‌కు ఎంఐఎం గుది బండగా మారుతోందా?

గతంలో జరిగిన ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా కెసిఆర్ ఎంఐఎంతో అనధికారిక పొత్తు పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈసారి జరగబోయే ఎలక్షన్లలో ఎంఐఎం తో అధికారిక పోత్తే పెట్టుకుందామని ఫిక్స్ అయ్యారట కేసీఆర్. అయితే ఎప్పుడూ ఏడు స్థానాల్లో గెలిచే ఎంఐఎం ఈసారి మరొక 10స్థానాలు ఆదనంగా కావాలని అడుగుతుందట. అంటే ఆ  స్థానాల్లో కెసిఆర్ పోటీ చేయకూడదు.


అయితే ఇప్పుడు ఎంఐఎం మొత్తం కలిపి 17స్థానాలు అడుగుతుంటే కమ్యూనిస్టులు 10స్థానాలు అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. అంటే టోటల్‌గా 27. ఈ 27 స్థానాల్లో కూడా టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ పార్టీ పోటీ చేయకూడదని తెలుస్తుంది. ఉన్నది 119 సీట్లు. అందులో కనీసం 19స్థానాలు వీళ్లిద్దరికీ కలిపి ఇచ్చినా కూడా ఇక 100 సీట్లు మిగులుతాయి. అయితే ఈ వంద సీట్లను ఏ విధంగా గెలుపొందాలి అనే ఒక గందరగోళం నెలకొంది ఇప్పుడు.  


అయితే టిఆర్ఎస్ గందరగోళ పడడానికి ఇక్కడ రెండు కారణాలు ముఖ్యంగా ఉన్నాయని తెలుస్తుంది. ఒక కారణం ఏంటంటే పార్టీపై వ్యతిరేకత ఉండడం ఒకటి. రెండవది తెలంగాణలో కాంగ్రెస్ దూకుడుగా ఉండడం. ఈ రెండు కారణాల వల్ల ఇప్పుడు టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ 100 స్థానాల్లో ఎలా గెలుపొందాలి అనే ఆలోచనలో తర్జనభర్జన పడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని ఎంఐఎం నాయకుడు ఓవైసీ ఇప్పుడు డ్రామా ప్లే చేస్తున్నట్లుగా తెలుస్తుంది.


ఆయన లెక్క ఏంటంటే తమ మతస్తుడైనా పక్క పార్టీలో సక్సెస్ అవ్వకూడదు. ఆయన ఇప్పుడు బోధన్ ఎమ్మెల్యే టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తన పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలను అరెస్టు చేయించారని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ని దించేయాలని చెప్పి అక్కడ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారట. అయితే ఓవైసీకి కెసిఆర్ మద్దతు ఉండడంతో షకీల్ రోడ్డుపైకి వచ్చి దమ్ముంటే ఓవైసీనే వచ్చి పోటీ చేయాలని అంటున్నాడట. తనపై హత్య ప్రయత్నం కూడా చేస్తున్నారని అంటున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: