తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

గతంలో ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో.. అలాగే దుబ్బాకలో సాధించిన విజయాలు బిజెపికి మంచి ఊపునిచ్చాయి. ఆ తర్వాత హైదరాబాద్ కార్పొరేషన్ విజయం కూడా దానికి తోడయ్యింది‌. ఆ తర్వాత బిజెపి అగ్ర నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా బిజెపిలోకి తీసుకురావడం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని పార్టీలోకి తీసుకోవడమే కాకుండా ఆయనతో రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలకు పోటీ చేయించారు కూడా.


అయితే అప్పుడు అక్కడ వచ్చిన ఓటమి తో బిజెపి తీవ్ర నైరాశ్యానికి గురైందని తెలుస్తుంది. ఆ ఒక్క ఓటమికే బేలా పడిపోయిందా అంటే కాదని తెలుస్తుంది. అలాగైతే ఈటల రాజేందర్ ఓటమితోను హైదరాబాదులో అత్తెసరు మార్కులతో గెలిచిన విజయానికి బీఆర్‌ఎస్‌ కూడా డీలా పడిపోవాలి కదా అని అంటున్నారు కొంతమంది. కానీ అక్కడ సర్వశక్తులు వడ్డీ మరి అలాగైనా గెలిచారు. పదివేల ఓట్ల తేడాతోటైనా ఓడిపోయాం కదా అని ధైర్యం ఉండాలి కదా అంటే అది లేదు.


తెలంగాణలో ఎంతో మంది నాయకులు భారతీయ జనతా పార్టీలోకి రావాలని కొట్టుకుంటూ ఉంటే అసలు ఎటువంటి సంబంధం లేని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు బిజెపిలోకి రాజ్య సభ సీటు ఇచ్చారు. దాని వల్ల తెలంగాణ బిజెపికి వచ్చే ఉపయోగం ఏమిటో కూడా ఎవరికీ అర్థం అవ్వలేదు. బిజెపి ఇప్పుడైనా ఆత్మ విమర్శ చేసుకుని ముందుకు వెళ్లాలని కొంతమంది రాజకీయ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.


మరోవైపు చూస్తే బిజెపి రాష్ట్ర నాయకత్వానికి సంబంధించిన పనులను కూడా కేంద్ర ప్రభుత్వమే చూస్తుంది. ఈటల రాజేందర్, మరికొంతమంది నాయకులను అధిష్టానం దగ్గరికి పిలవడం గాని ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ నాయకులే చూస్తున్నారు అని తెలుస్తుంది. మరోవైపు నడ్డా హైదరాబాద్ వచ్చి  నాగేశ్వర్ ని కలిసారు. దానివల్ల ఉపయోగం ఉందా, ఆయన ఏమైనా తన పద్ధతి మార్చుకుంటారా అని అడుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: