వార్నీ..‘జైలర్ 2’లో గెస్ట్ రోల్ పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదా..!

Thota Jaya Madhuri
దక్షిణ భారత సినీ పరిశ్రమలో భారీ అంచనాలను సొంతం చేసుకున్న ప్రాజెక్ట్‌లలో జైలర్ 2 ఒకటి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ విజయానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌పై సహజంగానే భారీ హైప్ ఏర్పడింది. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఈ సినిమాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడుదల తేదీగా ఆగస్టు నెలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, సినిమాలో ఒక కీలకమైన గెస్ట్ రోల్ కోసం పలువురు ప్రముఖ హీరోలను సంప్రదించినట్లు సమాచారం. మొదటగా నందమూరి బాలకృష్ణను అడిగినప్పటికీ, వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ కారణాల వల్ల ఆయన ఆ ఆఫర్‌ను అంగీకరించలేదని తెలుస్తోంది. ఆ తరువాత బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ను సంప్రదించినప్పటికీ, ఆయన కూడా వివిధ కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి ముందుకు రాలేదని వార్తలు వచ్చాయి.

చివరికి ఈ గెస్ట్ రోల్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సంప్రదించగా, ఆయన కూడా మర్యాదపూర్వకంగా నిరాకరించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రాన్ని సురేందర్ రెడ్డి  దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ చిత్రానికి అనుగుణంగా ఆయన తన లుక్‌లో మార్పులు చేసుకున్నారు. ఇలాంటి సమయంలో ‘జైలర్ 2’లో గెస్ట్ రోల్ చేయాలంటే మళ్లీ తన గెటప్ మార్చాల్సి రావడం ఆయనకు ఇష్టం లేకపోయిందని టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ రంగంలో కూడా అత్యంత కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన పూర్తిగా పాలనాపరమైన పనుల్లో నిమగ్నమయ్యారు. షెడ్యూల్స్ పరంగా కూడా ఆయనకు సమయం కేటాయించడం కష్టమవుతుండటంతో, సినిమా కోసం డేట్స్ ఇవ్వడం సాధ్యం కాలేదని సమాచారం. అంతేకాకుండా, ఇటీవలి కాలంలో ఆయన ఆరోగ్యంపై కూడా కొంత జాగ్రత్త అవసరమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అన్ని కారణాల సమ్మేళనంతోనే పవన్ కళ్యాణ్ ‘జైలర్ 2’ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే, ఒకవేళ ఆయన ఈ ప్రాజెక్ట్‌ను అంగీకరించి ఉంటే, సినిమా మరింత భారీ స్థాయిలో ఆకట్టుకునేదని అభిమానులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరియు రజనీకాంత్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే, అది నిజంగా సినీ ప్రేమికులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి అయ్యేది అనడంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: