మోడీ అమెరికా టూర్.. కుళ్లుకుంటున్న చైనా?
ఈ తయారీ వల్ల మనకు అనేక రకాల ఉపయోగం ఉంటుంది. చాలా మందికి ఉపాధి దొరకడమే కాకుండా యుద్ద విమానాలను మరింత దృఢంగా తయారు చేసుకోవచ్చు. ప్రపంచ దేశాల్లో తయారయ్యే మన్నికతో మనం వాటిని తయారు చేసుకోవచ్చు. అమెరికా సంయుక్తంగా ఉంటుంది. కాబట్టి క్వాలిటీకి ఢోకా ఉండదు. ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా దీన్ని చైనా ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికా, భారత్ మధ్య ఒప్పందం వల్ల చైనాకు ముప్పు పొంచి ఉంటుందని భావిస్తోంది.
కానీ భారత్ లో తయారీ అనేది కేవలం భారత రక్షణ వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికే కానీ ఎవరితో యుద్ధానికి చేయడానికి కాదన్నది భారత్ చెబుతున్న అంశం. కానీ చైనా దీన్ని వ్యతిరేకించడానికి కారణాలు ఉన్నాయి. భవిష్యత్తులో అమెరికా, ఇండియా కలిసి చైనాపై దాడి చేసే అవకాశం ఉంటుందని డ్రాగన్ కంట్రీ అనుకుంటుంది. చైనా రష్యా, టర్కీ, ఇరాన్, గల్ప్ దేశాలతో ఎన్నో ఒప్పందాలు చేసుకున్నా ఇండియా ఏనాడు దాన్ని అడ్డుకోలేదు. ఎలాంటి భద్రత కారణాలు చూపలేదు.
కానీ భారత్ అమెరికాతో యుద్ధ విమాన రంగంలో ఇంజిన్ల తయారీ అనగానే ఒక్కసారిగా విమర్శలు చేస్తోంది. చైనా ఇన్ని రోజులు దాయాది దేశం అయినా పాకిస్థాన్ కు సపోర్టు ఇస్తుంటే భారత్ ఏమీ అనలేదు. భద్రతా మండలిలో ఉగ్రవాదులను పాక్ కంటే చైనా ఎక్కువ కాపాడుతుంటే భారత్ చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం అమెరికాతో భారత్ విమాన ఇంజిన్ల తయారీ అనే సరికి ఒక్క సారిగా ఉలికి పడుతోంది.