ఆ చైనా ప్రయోగం.. ప్రపంచం కొంప ముంచుతుందా?

అంతరిక్ష పరిశోధనలతో పాటు సముద్ర గర్భంలో భారత్ పరిశోధనలు చేస్తుంది. హిమనీ నదాలు, అంటార్కిటికా ఖండంలో బంగారు నిధులు, నిక్షేపాలు ఉన్నట్లు తెలిశాయి. మంచు కొండల్లో ఎన్నో నిక్షేపాలు, ఉన్నట్లు తెలుస్తున్నా వాటిని వెలికితీయడం అంత సులభమేం కాదు. సముద్ర గర్భంలో దాగి ఉన్న సంపదను వెలికితీసేందుకు భారత్ కూడా అనేక ప్రయత్నాలు మొదలు పెట్టింది. అది ఎంత వరకు విజయవంతం అవుతుందో చూడాలి.

చైనా కూడా భూమి లోపల 10 కిలోమీటర్ల పొడువునా రంద్రం వేయడానికి ప్రయత్నం చేస్తుందని తెలుస్తోంది. అది కూడా పెద్ద చతురస్రాకార ఆకారంలో వీటిని తవ్వుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు చిన్న పాటి పట్టణమంతా ఉండేలా పెద్ద తవ్వకాన్నిమొదలు పెట్టినట్లు బయట పడింది. అసలు భూమి లోపల అంత పెద్ద రంద్రం తవ్వడానికి కారణం ఏమై ఉంటుంది. ఎందుకు అంత పెద్ద రంద్రం తవ్వుతున్నారు.

దీని వల్ల ఎవరికీ లాభం చేకూరుతుంది. ఎవరూ నష్టపోతారు. ఎవరికీ లాభం ఉంటుందనే వివరాలు చైనా చెబితే కానీ ఎవరికీ తెలియదు. అది జరగరానీ నష్టం జరిగిన తర్వాత చెబుతుందా.. లేక ఆయిల్ నిక్షేపాలు భూమి లోపల 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయా? ఏదైనా సరికొత్త అణ్వస్త్రాన్ని భూమి లోపల ప్రయోగిస్తుందా? ఇంత పెద్దగా తవ్వడానికి కారణం ఏమై ఉంటుందని ఆలోచనలో పడిపోయారు. ఇలా తవ్వడం వల్ల ఏమైనా భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుందా? వస్తే దాన్ని నిలువరించడం ఎలా.. అంత లోతు ఎందుకు తవ్వుతున్నట్లు ప్రపంచాన్ని కుదిపేసే విషయం ఏమైనా తెలియబోతుందా.. ఇలా శాస్త్రవేత్తలకే అంతుపట్టని విషయాన్ని చైనా చేస్తోంది.

ఇప్పటికే కరోనా వైరస్ ను వదిలి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మరణాలకు చైనా కారణమని అన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. అయినా ఎక్కడా కూడా అదరకుండా బెదరకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థనే తమ చెప్పు చేతల్లో పెట్టుకుని శాసిస్తోంది. మరీ దీనిపై ఎలాంటి విషయాలు బయటపెడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: