కాంగ్రెస్‌లో దడ పుట్టిస్తున్న లోకల్‌ లీడర్స్‌?

కాంగ్రెస్ పార్టీ యువ నాయకులను ప్రోత్సహిస్తామని చెబుతుంది. కానీ ముఖ్యమంత్రి పదవులు ఇచ్చే సమయంలో మాత్రం సీనియర్లకే ప్రాధాన్యం ఇస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో ఆ పార్టీ అధ్యక్షుడు డి.కె శివకుమార్ కీలక పాత్ర పోషించారు. సీఎం పదవి వస్తుందని ఆశించారు. రెండు మూడు రోజుల పాటు పట్టుబట్టినా కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ సిద్ధ రామయ్యకే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది.

రాజస్థాన్ లో కూడా యువ నాయకుడు సచిన్ పైలెట్ ను కాదని అశోక్ గెహ్లట్ కు సీఎం పదవి ఇచ్చారు. అయితే యువ నాయకుడు సచిన్ పైలెట్ కు సీఎం పదవి ఇస్తే అశోక్ గెహ్లట్ పార్టీని చీల్చి పదవిలోకి రావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇద్దరు కలిసి అశోక్ గెహ్లట్ ను బుజ్జగించి ఆఖరుకు ఆయననే సీఎం పదవిలో కూర్చోబెట్టారు. తిరగబడిన సచిన్ పైలెట్ కు కాంగ్రెస్ అధిష్టానం కలిసి పని చేయాలని సూచించింది.

మరో వైపు మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమలనాథ్ వైపు పార్టీ మొగ్గు చూపడంతో యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ లో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. అనంతరం మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు వారి మాటలు  వినకపోతే అధిష్టానంతో బెదిరింపులకు దిగి మరీ ముఖ్యమంత్రులుగా మారి పెత్తనం చెలాయిస్తున్నారు. వారు చెప్పింది వినకపోతే ఎక్కడ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎక్కడ మారుతారోనని అధిష్టానమే భయపడే పరిస్థితి ఉంది.

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే వారిని కంట్రోల్ చేసే సత్తా వస్తుందని కాంగ్రెస్ లో మాటలు వినిపిస్తున్నాయి. లేకపోతే సీనియర్ నాయకులు  మరో శరద్ పవార్, మమత బెనర్జీలా మారి సంస్థాగతంగా లోకల్ లో బలమైన నాయకులుగా ఎదిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: