జగన్.. ముందస్తుకు ఖాయమా?

సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళతారా  లేదా సాధారణ ఎన్నికలకు ప్రాధాన్యత ఇస్తారా అనే దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ లో జరిగే ఎన్నికల తో ఆంద్రప్రదేశ్ ఎన్నికలు జరగవచ్చనే సూచనలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు చంద్రబాబు నాయుడు, మరో వైపు లోకేష్, అటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఇంకో వైపు సొంత పార్టీ లో కొంతమంది లీడర్ల తిరుగుబాటు, వైఎస్ వివేకా హత్య కేసు, ఇలా ఒకదాని వెనక ఒకటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఇబ్బందులకు గురి చేస్తోంది.

ఇదంతా ఒక భాగం అయితే టీడీపీ కి మీడియా బలం ఎక్కువగా ఉంది. ఈనాడు ఈటీవీ, ఆంధ్ర జ్యోతి, టీవీ5 వైసీపీ ప్రధాన శత్రువులు అని పదే పదే జగన్ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు కి వెళితే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది. ఎవరికి లాభం చేకూరుతుందనే అంశాలపై జగన్ దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఎన్నికలతో వెళితే ఆంధ్ర ప్రదేశ్ సెటిలర్స్ అందరూ హైదరాబాద్ లోనే ఓట్లు వేస్తారు. దీనివల్ల దాదాపు 20 నుంచి 30 లక్షల ఓట్లు ఆంధ్రలో వేయరు. ఇది టీడీపీ కి వ్యతిరేకంగా వైసీపీ కి అనుకూలంగా పనికి వస్తుందేమోనని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే గనక జరిగితే వైసీపీ కి 120 స్థానాల వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకొనున్నట్లు తెలుస్తోంది.  

పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కోసం వెళ్లారు. ఆయన షూటింగ్ అయిపోయే సరికి జులై వస్తుంది. ప్రచారం చేయడానికి సమయం దొరకదు. టీడీపీ అప్పటివరకు పూర్తిగా రెడీ కాదు. అభ్యర్థుల విషయంలో గందరగోళం ఉంటుంది. కాబట్టి ముందస్తు కు వెళ్లి మళ్లీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా గెలవాలని భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: