మోదీ రాజదండం: రాజరికమా.. సంప్రదాయమా?

అధునాతనమైన సాంకేతికతతో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇవాళే ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. దీన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ  ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా న్యూ పార్లమెంట్ ఫస్ట్ లుక్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇంకొక విశేషం ఏమిటంటే మన చరిత్రనే మళ్లీ మనకి కొత్తగా పరిచయం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

మన పరిపాలనకు, అధికారానికి చిహ్నంగా భావించే  రాజదండాన్ని మళ్లీ ఇప్పుడు సరికొత్తగా బయటకు తీయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ రాజదండం పేరే సెంగోల్. తమిళ పదమైన సెమ్మాయ్ (ధర్మం) అనే పదం నుంచి దీన్ని తీసుకున్నారని తెలుస్తుంది. బ్రిటిషర్లు, భారత్ ను వదిలి వెళ్ళిపోయేటప్పుడు మనకు వాళ్లకు మధ్య జరిగిన అధికార బదిలీకి ఈ రాజదండం నిదర్శనమని అమిత్ షా దానికున్న చారిత్రక ప్రాధాన్యతను గుర్తుచేశారు.

ఈ రాజదండం ఆలోచన అనేది  స్వతంత్ర భారత దేశపు మొదటి గవర్నర్ జనరల్ అయిన రాజాజీ రాజగోపాలాచారి సలహా మీద మొదలైందని తెలుస్తుంది. ఆయన చెప్పిన దాని ప్రకారం తమిళనాడులో చోళ రాజు కొత్తగా నియామకం అయ్యేటప్పుడు పూజారి ఆయనకు ఒక బంగారు రాజదండాన్ని ఇచ్చే సంప్రదాయం ఉందని ఆయన అన్నారట. ఈ ఆలోచన నెహ్రూ కి కూడా నచ్చి తమిళనాడులోని తరువుడుత్తరై పీఠం వాళ్లకి దీనిని తయారు చేయమని ఇచ్చారట.

దీనిని వాళ్ళు మద్రాస్ లోని స్వర్ణకారుడు చేత తయారు చేయించారట. ఈ రాజ దండం పొడవు 5 అడుగుల వరకు ఉంటుందట. ఈ దండం పైన న్యాయానికి ప్రతిరూపంగా ఒక నంది చిహ్నాన్ని అమర్చారట. స్వాతంత్ర ప్రకటన సమయంలో అర్ధరాత్రి 15 నిమిషాల ముందే దీనిని అప్పుడు ప్రధాని నెహ్రూకి అందించారట. ఈ ఆది వారం  దీన్ని ప్రధాని మోదీ స్పీకర్ కుర్చీ సమీపంలో ఆవిష్కరిస్తారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల వెల్లడించారు. అయితే ఈ సెంగోల్‌ ను నెహ్రూకి కానుకగానే ఇచ్చారని.. ఇది అధికార మార్పిడికి చిహ్నం కాదని కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నారు. మోదీ రాచరికపు పోకడలకు ఇది నిదర్శనమంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: