నోరు జారిన చంద్రబాబు.. వైసీపీ కుమ్మేస్తుందా?
జగన్ అమరావతి లో పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అనుకున్నారు. ఒక సెంట్ భూమి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే చంద్రబాబు గారి దృష్టిలో ఒక సెంట్ భూమి అంటే శ్మశానం. 48 గజాలు భూమిని శ్మశానం తో పోల్చారు. అది రాజకీయ విమర్శ కూడా ఇంత దిగజరుడుగా ఉంటుందని ఎన్నడు ఉహించలేమని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతి రాజధానిలో పేదలకు నేను ఎప్పుడో ఇల్లు రిజస్ట్రేషన్ చేశాను అని అంటున్నారు. అయితే ఇంతవరకు వాటిని ఎందుకు ఇవ్వలేదనే వాదన వినిపిస్తోంది. 350 గజాల భూమి అయితే దానిని ఆర సెంటుగా, 480 గజాల భూమి అయితే సెంట్ భూమి గా పరిగణించవచ్చు.
మరి అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు నాయుడు ఎందుకు కూడా చంద్రబాబు నాయుడు ఇల్లు ఎందుకు నిర్మించి ఇవ్వలేదని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఆ రోజునే స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టించి ఉంటే.. పేదవారికి ఎంతో కొంత లాభం చేసి ఉండేవారు కదా.. ఎందుకు పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వలేదని అంటున్నారు రాజధాని అమరావతి ప్రాంత ప్రజలు దేవుడిగా చంద్రబాబు ను చూసే వారు కదా అయిన ఎందుకు ఇవ్వలేదు. ఒక వేళ ఇస్తే అవి మురికివాడల మాదిరి అవుతాయని దురుద్దేశం తోనే ఇవ్వలేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.