లోకేశ్‌ కోసం అదిరే ప్లాన్‌ రెడీ చేసిన చంద్రబాబు?

చంద్రబాబు విజన్ కు పవన్ కల్యాణ్ తోడయ్యారు. చంద్రబాబు విజన్ కు మొన్న రజినీకాంత్ కూడా ఫిదా అయ్యారు. అభివృద్ధిలో,  పొలిటికల్ లో చంద్రబాబు విజన్ వేరే లా ఉంటుంది. కిందటి సారి లోకేశ్ ను వారసుడిగా ప్రకటించాలని అనుకున్నారు. కానీ బీజేపీ అధిష్టానంతో గొడవ పెట్టుకోవడానికే టైం సరిపోయింది. ఆర్కే, రామోజీరావు వల్లే బీజేపీతో గొడవ పెట్టుకున్నారని చాలా మంది అనే వారు.  తర్వాత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం, అనంతరం జరిగిన పరిణామాలతో టీడీపీ దెబ్బతినడం వైసీపీ గెలవడం లాంటివి జరిగిపోయాయి.

దీని వల్ల లోకేశ్ కు అనుకున్నంతా ఇమేజ్ ఇచ్చి టీడీపీ లో బాబు తర్వాత లోకేశ్ అని చెప్పాలనుకున్న విషయం మరుగున పడిపోయింది. 2024 లో చంద్రబాబు సీఎంగా పదవి చేపట్టి తర్వాత రెండున్నరేళ్లకు మళ్లీ  లోకేశ్ కు సీఎం బాధ్యతలు అప్పగించే ప్లాన్ వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మెల్లగా పాలన అలవాటు పడిన తర్వాత 2029 నాటికి సీఎంగా లోకేశ్ పూర్తి స్థాయి పదవీ బాధ్యతలు చేపట్టేలా ప్లాన్ చేస్తున్నారు.  పవన్ కల్యాణ్ కూడా మొదటి నుంచి చంద్రబాబును పూర్తిగా ఎప్పుడూ విమర్శించిన దాఖలాలు లేవు.  

పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా లోకేశ్ ప్రస్తుతం నిర్ణయాలు తీసుకుంటున్నారు. టికెట్ల విషయం లోకేశ్, ఏదైనా పెద్ద సమస్య ఉంటే చంద్రబాబు చూసుకోవడంతో పార్టీలో సమస్యలు మెల్లిగా పరిష్కారమవుతున్నాయి. చంద్రబాబు విజన్ లో డెవలప్ మెంట్ విషయంలో ప్రతిదీ తానే చేసినట్లు చెబుతుంటారు. మరి అమరావతి ని అయిదేళ్లలో ఎందుకు చేయలేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ విషయంలో ప్రతి సారి ఇదే జరుగుతుంది.

ప్రతి డెవలప్ మెంట్ విషయంలో చంద్రబాబు నేనే హైదరాబాద్ డెవలప్ చేశానని అనడం, తెలంగాణలోని ఇతర పార్టీలు విమర్శించడం షరా మామూలే. అయితే కొన్ని విషయాల్లో ఆయన గొప్పతనాన్ని కీర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: