కర్ణాటక విచిత్రం: ఓట్లు తగ్గకపోయినా ఓడిన బీజేపీ

కన్నడ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే.. కాంగ్రెస్ 136 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 65 స్థానాల్లో గెలిచింది. జేడీఎస్ 19 స్థానాలకే పరిమితమైంది. 2018 తో పోల్చితే కాంగ్రెస్ మొత్తం 5 శాతం ఓట్లు పెరిగి 56 స్థానాలను అదనంగా గెలుచుకుంది.  ఈ అయిదు శాతం ఓట్లను జేడీఎస్ నుంచి లాక్కోగలిగింది. ఇందులో విశేషమేమిటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఓట్లు ఎక్కడా తగ్గలేవు.

కానీ 2018 ఎన్నికలతో పోలిస్తే 39 స్థానాల్లో బీజేపీ సీట్లు తగ్గిపోయాయి. 2018తో పోలిస్తే 18 స్థానాలు జేడీఎస్ కోల్పోయింది.  మధ్య కర్నాటక, హైదరాబాద్ కర్నాటక, మైసూరు, బాంబే కర్ణాటక ప్రాంతాల్లో కాంగ్రెస్ తన సత్తా చాటింది. బెంగళూరు, కోస్తా కర్ణాటకలో బీజేపీ పట్టు నిలుపుకుంది.  జేడీఎస్ మాత్రం మైసూరు మినహా ఎక్కడా కనిపించ లేదు. ఇది ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ.

బెంగుళూరు ప్రాంతంలో 28 గాను బీజేపీ 15 స్థానాల్లో గెలుపొందితే కాంగ్రెస్ 13 స్థానాల్లో గెలిచింది.  మధ్య కర్నాటకలో బీజేపీ కేవలం 5 స్థానాల్లోనే గెలిచింది. కాంగ్రెస్ మాత్రం 19 స్థానాల్లో విజయం సాధించింది. జేడీఎస్ ఇక్కడ ఒక్క స్థానాన్నే గెలుచుకుంది.  కోస్తా కర్ణాటకలో బీజేపీ 13 కాంగ్రెస్ 6  సీట్లలో గెలిచాయి.  ముఖ్యంగా హైదరాబాద్ కర్ణాటక బీజేపీని బాగా దెబ్బతీసింది. 41 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 26 స్థానాల్లో విజయం సాధించింది. ఇక్కడ బీజేపీకి కేవలం 10 స్థానాలు మాత్రమే వచ్చాయి.

ఇలా కర్ణాటకలో ఎక్కడ చూసిన కాంగ్రెస్ హస్తం గాలి వీచింది. దీంతో 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఎన్నడూ కూడా ఏ పార్టీ ఇంత గ్రాండ్ విక్టరీని అందుకోలేదు. ఇప్పటికైనా కర్ణాటకలో అయిదేళ్ల పాటు సంపూర్ణంగా పాలన చేపట్టే పార్టీ ఉండాలని కోరుకుని ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టినట్లు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలు హామీలు కూడా చాలా పెద్దవే.. మరి వాటిని ఎలా తీర్చుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: