20 ఏళ్లలో భారత్.. ప్రపంచంలోనే మూడో ర్యాంక్?
ఈ జిడిపిలో చైనా 1266%తో మొదటి స్థానాన్ని వహించింది. దాని తర్వాత స్థానాన్ని 466 శాతంతో రష్యా చేరుకుందని తెలుస్తుంది. ఆ తర్వాత ఇండియా 440 శాతంతో మూడవ స్థానానికి చేరుకుందని తెలుస్తుంది. ఆ తర్వాత స్థానాల్లో బ్రెజిల్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, టర్కీ, సౌత్ కొరియా, సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా, కెనడా, అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఇటలీ, అర్జెంటీనా, జపాన్ ఉన్నాయని తెలుస్తుంది.
అంటే జిడిపి గత 20 ఏళ్లలో పెరుగుదలలో చూసుకుంటే అమెరికా 10వ స్థానంలో ఉంటే, ఆ తర్వాత స్థానంలో బ్రిటన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇలా ఇన్నేళ్లలో జపాన్ కు 6శాతం గ్రోత్ ఉంటే, అర్జెంటీనాకు 33%గ్రోత్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇటలీ 23%, ఫ్రాన్స్ 65%, జర్మనీ 77%, బ్రిటన్ 85.7%, అమెరికా 108.7%, కెనడా 166%, ఇండోనేషియా 170%, సౌత్ ఆఫ్రికా 200%, సౌత్ కొరియా 220%, టర్కీ 250%, ఆస్ట్రేలియా 250 %, సౌదీ 300%, బ్రెజిల్ 316%, ఇండియా 440%, రష్యా 460%, చైనా 1266%లో ఉన్నాయని తెలుస్తుంది.
జిడిపిలోని ఈ గ్రోత్ అనేది ఈ 20 ఏళ్లలో ఇంత పెరిగిందని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే భారత్ మూడో స్థానంలో ఉంది. భారత్ జీడీపీ విషయంలో తన గ్రోత్ ని ఇలాగే కాపాడుకుంటూ వస్తే త్వరలో అది ప్రపంచంలోనే నెంబర్ వన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.