ఆ లాయర్ అంటే ఆ పత్రికలకు అంత ప్రయారిటీ ఏంటో?
ఇక్కడ విచిత్రమైన జాఢ్యం కొనసాగుతుంది. హైకోర్టులో కొన్ని వందల మంది లాయర్లు ఉంటారు. వారు అనేక అంశాల మీద కేంద్రానికి, కేంద్ర మంత్రులకు లేఖలు రాస్తుంటారు. వాటిన్నింటిని ఎల్లో మీడియాగా పేరున్న పత్రికలు ప్రచురించగలవా.. కానీ గూడపాటి లక్ష్మినారాయణ రాస్తున్న లేఖలను మాత్రం ఓ పత్రికలో పదే పదే ప్రస్తావనకు తీసుకొస్తున్నారు.
సామాన్య లాయర్ రాస్తే ఏ విషయం గురించైనా పత్రికలో రాస్తారా. ఆ లాయర్ కు ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నారు. లాయర్ విషయంలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి గల కారణం అతను టీడీపీకి చెందిన వ్యక్తి అయి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రలో కొన్ని మీడియా సంస్థలు తమకు నచ్చిన వ్యక్తుల గురించి ఆహా ఓహో అంటూ కథనాలు రాస్తూ, నచ్చని వ్యక్తుల క్యారెక్టర్లను చిన్నవిగా చేసి చూపిస్తున్నాయి. ఇలా చూపించడం ద్వారా తమకు ఉన్న ఉక్రోషాన్ని వెల్లగక్కుతున్నాయి.
పత్రికలు చదివే సామాన్య పాఠకులు, ఏదీ నిజమో, ఏదీ అబద్ధమో తేల్చుకోలేక సతమతమవుతున్నాడు. నిజాలను రాసి ప్రజలకు చెప్పే కాలం పోయింది. తమ అనుకూల పార్టీ లీడర్ కు జేజేలు కొట్టే వార్తలు రాయడం, వారు తప్పు చేస్తే వాటిని కప్పిపుచ్చడం. ఇతర పార్టీల నాయకులు ఎక్కడ దొరుకుతారా అని చూడటం. ఏ మాత్రం అవకాశం ఉన్న బట్ట కాల్చి మీద వేయడం చేస్తున్నారు.. ప్రజలు ఆలోచిస్తున్నారనే విషయాన్ని కనీసం అర్థం చేసుకోకుండా వారి భావజాలాల్ని సమాజంపై రుద్దుతున్నారు.