బ్యాడ్ డేస్: కేజ్రీవాల్‌కు దెబ్బ మీద దెబ్బ?
లోక్ పాల్ బిల్లు అంటేనే పెద్ద ఇది అని అంటారు. దాని పరంగా భారత ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కూడా ఓ ముగ్గురు విచారిస్తారట. ఆ ముగ్గురు ఎవరనేది వీళ్ళు డిసైడ్ చేస్తారట. అసలు విచారించడానికి, విచారించే వాళ్ళని డిసైడ్ చేయడానికి అసలు వీళ్ళు ఎవరు అని అప్పట్లోనే కొంతమంది అనడం జరిగింది. దీనిని చాలామంది అప్పుడు వెర్రిగా సపోర్ట్ చేయడం కూడా జరిగింది.
దీన్ని అడ్డుపెట్టుకుని పెద్ద వాళ్ళు అయిపోవడం జరిగింది వాళ్ళు. జీవితంలో రాజకీయంలోకి రానన్న కేజ్రీవాల్ రాజకీయంలోకి వచ్చారు. ఏ పార్టీలో జాయిన్ అన్న ఆయన ఏకంగా పార్టీనే పెట్టారు. అసలు సంక్షేమ పథకాలు ఇవ్వడమే ప్రజలకు మంచిది కాదన్న ఆయన, తప్పన్న ఆయన సంక్షేమ పథకాలు ఇస్తూ వస్తున్నారు. ప్రజలకు డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పిన ఆయనే ప్రజలకు డబ్బులు ఇస్తూ వచ్చేస్తున్నారన్న విమర్శ ఉంది.
నా పార్టీలో నాయకులు ఎవరికీ సెక్యూరిటీ ఉండదు అన్నా కూడా వాళ్ల పార్టీలో వాళ్ళందరూ ఇప్పుడు ఫుల్ సెక్యూరిటీతో తిరుగుతున్నారు. తమ నాయకులు ఎవరు కూడా ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లలో ఉండరని చెప్పి అన్నా కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లలోనే ఉంటున్నారు. ఆయన కూడా అలాగే అన్నా కూడా తర్వాత 45కోట్ల రూపాయలు విలువ చేసే రెన్యువేషన్ చేయించుకున్నారట తన ఇంటికి, అది కూడా ప్రభుత్వ సొమ్ముతో.