ప్లీజ్‌ ఆ పని చేయొద్దు?: రష్యాకు అమెరికా విజ్ఞప్తి!

రష్యా, ఉక్రెయిన్ యుద్దం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇప్పటివరకు ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాలను రష్యా ఆక్రమించుకుంది. అయినా పట్టు వదలకుండా యుద్ధం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భావిస్తున్నాడు. రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో జెపోజెజరియా ఒకటి. ఈ ప్రాంతంలో అణు విద్యుత్ కర్మాగారాలు ఉన్నాయి. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా, ఉక్రెయిన్ పై దాడి చేస్తున్న సమయంలో అణు విద్యుత్ కర్మాగారాలపై బాంబులు వేసిందని ఉక్రెయిన్ ప్రచారం చేసింది. అదంతా అబద్ధమని తర్వాత తేలింది. ఒక వేళ అక్కడ  గనక బాంబులు పడి ఉండే ఇప్పటికే ఉక్రెయిన్ మొత్తం సర్వ నాశనం అయిపోయేది.

పూర్తిగా రేడియేషన్ బారిన పడి పీల్చుకోవడానికి ఆక్సిజన్ కూడా ఉండేది కాదు.  అక్కడ జరుగుతున్న యుద్దంలో జెపోజెజరియాలోని  అణు విద్యుత్ కేంద్రాలను రష్యా స్వాధీనం చేసుకుంది. ఆ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు మరణించారు. దీని వల్ల  చాలా పెద్ద నష్టమే జరిగింది. ప్రస్తుతం ఉక్రెయిన్ రివర్స్ ఎటాక్ కి దిగుతోంది. ఉక్రెయిన్ జెపోజెజరియా లోని అణు విద్యుత్ కేంద్రాలపై దాడులకు దిగుతోంది. దీంతో రష్యా ఎదురు దాడి చేస్తుంది. ఒకవేళ విధ్వంసం అయితే ఉక్రెయిన్ తో పాటు, యూరప్ దేశాలకు కూడా ముప్పు పొంచి ఉంటుంది. దీంతో ఒక అడుగు వెనక్కి తగ్గిన అమెరికా యుద్ధం ప్రారంభమైన మొదటి సారి రష్యాకు విన్నపం చేసింది.

మీరు యుద్ధం ఎంతైనా చేయండి కానీ అణు విద్యుత్ కర్మాగారాల జోలికి మాత్రం పోకండి. ఒక వేళ అవి పేలిపోతే ప్రపంచానికే హాని కలుగుతుందని రష్యాను వేడుకుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్దం ప్రారంభమైన మొదటి సారి అగ్రరాజ్యం తగ్గి మాట్లాడటం ఇదే మొదటి సారి. ఏదైమైనా ఈ యుద్దం ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది. లేకపోతే న్యూక్లియర్ ప్లాంట్ గనక ధ్వంసమైతే ఊహకందని రీతిలో నష్టముంటుందని గ్రహించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: