యూపీ మర్డర్స్: పాపులర్ అవుదామని చంపేశారట?
అతీక్ అహ్మద్ ను చంపి యూపీలో డాన్లు కావాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. గతంలో వీరు చిన్న చిన్న నేరాలకు పాల్పడిన వారు. తల్లిదండ్రుల మాటలు పెడచెవిన పెట్టి ఇష్టారీతిన జులాయిగా తిరిగేవారు. దీంతో తల్లిదండ్రులు వీరిని పట్టించుకునే వారు కాదు. నేర సామ్రాజ్యంలో తమ కంటూ ప్రత్యేక పేరు ఉండాలని అనుకునే వారు.
చిన్నతనంలోనే అరుణ్ మౌర్య తల్లిదండ్రులు చనిపోయారు. 10 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయాడు. 2014 లో కాస్ గంజ్ రైలు దోపిడి ఘటనలో నిందితుడు. ఆ ఘటనలో అడ్డొచ్చిన పోలీసు కానిస్టేబుల్ ను హత్య చేశాడు. అనంతరం జైలు జీవితం గడిపి బెయిల్ పై బయటకు వచ్చాడు. అరుణ్ మౌర్యకు ఇద్దరు సోదరులు కాగా వారు ఢిల్లీలో తుక్కు వ్యాపారం చేస్తున్నారు.
ఇలా నేరాలు అలవాటు పడి అతీక్ అహ్మద్ కంటే గొప్ప రౌడీ షీటర్లు కావాలనే కోరికతో ఏకంగా పోలీసులు ఉండగానే వారిని కాల్చేశారు. చిన్న వయసులోనే జైలు శిక్ష అనుభవించిన అరుణ్ మౌర్య, చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే లవ్లేశ్ తివారీ, సన్నీలు మీడియా ఎదుటే అతీక్, అఫ్రాఫ్ లను హత్య చేశారు.