దూసుకుపోతున్న దక్షిణ మధ్య రైల్వే?

దక్షిణ మధ్య రైల్వే దూసుకుపోతోంది. గత సంవత్సరం 117.797 మిలియన్ టన్నులు, 2018-19లో 122.5 మిలియన్ టన్నులు సరుకు రవాణా చేసినట్లు రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. 2022-22లో 127 మిలియన్ల ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించారని, 2022-23లో 255 మిలియన్ల ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించారన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.391 కోట్ల విలువ గల స్క్రాప్ ను విక్రయించామన్నారు.


ఎం.ఎం.టీ.ఎస్ రెండో దశ ప్రాజెక్టు 2024 జనవరి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ అంటున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రద్దీ తగ్గించడంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే చేపడుతున్న చర్లపల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుందని రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. చర్లపల్లి టర్మినల్ వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి వస్తుందని రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే సాధించిన విజయాలను జీఎం ఏకే జైన్ వివరించారు.


వందేభారత్ రైళ్లపై దాడులు చేసిన వారిపై 9 కేసులు నమోదు చేశామన్నారు. దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జోన్ నుండి 131.854 మిలియన్ టన్నుల సరుకు రవాణాను రవాణా చేసింది.. ఇది జోన్ చరిత్రలో అత్యుత్తమ సరుకు రవాణా అని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు.


దక్షిణ మధ్య రైల్వేలో 49.8 కిలోమీటర్ల వరకు కొత్త లైన్ల ఏర్పాటు చేసినట్లు అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. 15.6 కి.మీలు భావనపాలెం-సత్తుపల్లి, 12.7కి.మీలు క్రిష్ణా-మగనూర్, 21.5కి.మీలు కొడకండ్ల-దుద్దెడ ప్రాంతాల్లో కొత్తలైన్ల నిర్మాణం చేపట్టామని అరుణ్ కుమార్ జైన్ అన్నారు. 151.38కి.మీల మేర డబ్లింగ్ పనులను, 182.17కి.మీల త్రిబ్లింగ్ ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తయ్యాయన్నారు. రైళ్ల వేగాన్ని 130కిలోమీటర్ల వరకు పెంచామన్నారు. సికింద్రాబాద్-కాజిపేట్ రూట్ ను గోల్డెన్ డయాగ్నల్ రూట్గా జీఎం అభివర్ణించారు. రైల్వే ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు అని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: