జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?
విజయనగరం జిల్లా నెల్లిమర్ల దగ్గర ఒక ప్రాంతానికి వెళ్లినపుడు స్టిక్కర్లు వేయవద్దని టీడీపీ వారు అడ్డుకున్నారు. అయితే ఆ గ్రామ సర్పంచ్ ఆ సమయంలో జోక్యం చేసుకుని మీరెందుకు అడ్డుపడుతున్నారు. పథకాలు అందిన ఇంటికే స్టిక్కర్లు వేస్తున్నారు కదా అని ప్రశ్నించారు.
పథకాలు ఏమైనా మీ ఇంటి నుంచి ఇస్తున్నారా అని ఎదురు తిరిగారు. స్టిక్కర్లు వేయకపోతే మీకు పథకాలు రద్దవుతాయని బెదిరిస్తున్నారు. అయితే ఎవరూ స్టిక్కర్లు వేయించుకోలేదు. ఎవరూ స్టిక్కర్లు వేయించుకున్నారు. ఎవరు ప్రతిపక్ష పార్టీ అయినా స్టిక్కర్ వేసుకున్నారు. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు. వారు ఎంతమంది అనుకూలంగా ఉన్నారు. పథకాలు పొందిన కూడా ప్రభుత్వానికి అనుకూలంగా లేని వారి ఓట్లను ఎలా రాబట్టాలనే వ్యుహ రచనతో స్టిక్కర్ల అమలు కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది.
తద్వారా ఏ గ్రామంలో, ఏ మండలంలో, నియోజకవర్గంలో ఎంతమంది వైసీపీ అనుకూల ఓట్లు ఉన్నాయి. ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది. ఎక్కడ వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత ఉన్న చోట ఎలా ముందుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి. అక్కడి లోకల్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలా దాన్ని అధిగమించాలో ఇది ఉపయోగపడనుంది. నిజానికి స్టిక్కర్ల ప్రోగ్రాం అందరూ విఫలమనుకునే వారు. కానీ వైసీపీ వేసిన వ్యుహం మెరుగైనది గానే భావించొచ్చు. వైసీపీ పార్టీ నచ్చని వారిని సైతం తమ కు కనీసం ఓట్లు వేయించుకునేలా మార్గం చేసుకున్నారు. తద్వారా ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొంతమంది ఓట్లనైనా పొందగలిగితే వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ విజయఢంకా మోగించనుంది.