జగన్ కుట్ర..? నిరూపణ అవుతుందా?
జగన్ కు సానుభూతి రావడం కోసమే దాడి చేశారని రాసుకొచ్చారు. అధికారంలోకి రావడానికి ఇలాంటి హత్యాయత్నాన్ని వాడుకున్నారా.. ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా.. శ్రీనివాసరావు దాడి చేేసేలా ఎవరైనా పురిగొల్పారా.. అనే అనుమానాలు జగన్ వ్యక్తం చేశారు. అయితే దీన్ని ఎన్ఐఏ కొట్టి వేసింది. జగనే ఈ విషయాలు అడుగుతున్నారు. కానీ అలాంటి సమయంలో టీడీపీ ఎందుకు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడగడం లేదు.
జగన్ కు ఏదైనా జరిగితే ఆ సమయంలో రాష్ట్రంలో అల్టర్నేటివ్ ఎవరూ ఉండరు. పోనీ ఇది కావాలనే జగన్ చేయించుకున్నారా.. సానుభూతి పొందేందుకు అంటే అదీ లేదని తేలింది. దీన్ని టీడీపీ అనుకూల మీడియా, పత్రికలు గోరంతను కొండంత చూపిస్తూ.. లేనిది ఉన్నట్లు గా ఉన్నది లేనట్లుగా చూపించడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంది.
ఇలా చేసే చంద్రబాబు నాయుడిని అధికారంలోకి రాకుండా 2019 సంవత్సరంలో ప్రధానంగా అడ్డుకుంది ఈ మీడియా సంస్థలే అని బయట ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రజల మనసులో ఒకటి ఉంటే చంద్రబాబుకు జై కొడుతున్నారు. ఆయన లేనిదే రాష్ట్రం లేదు. ప్రజలు ఏమైపోతారో అని అనుకుంటున్నారని అమాంతం ఆకాశం అంతా ఎత్తుకు ఎత్తేశారు. చివరకు ఏమైంది. 23 సీట్లతో ప్రతిపక్షంలో ప్రజలు కూర్చోబెట్టారు. అందుకే భజన పరులను పక్కన పెడితేనే టీడీపీకి విజయం సొంతమవుతుంది.