కేసీఆర్‌ తరహాలోనే జగన్ ముందస్తు ప్లాన్‌?

ఏపీలో టీడీపీ, సోషల్ మీడియా జగన్ ముందస్తుకు వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఒకవేళ జగన్ ముందస్తుకు వెళితే తెలంగాణ లో ఎన్నికలు జరిగే సమయంలోనే వెళ్లే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ఆంధ్ర సెటిలర్స్, ఓటర్లు ఆ సమయంలో తెలంగాణలోనే ఓటు హక్కు వినియోగించుకుంటారు. మరీ ముఖ్యంగా ఆంధ్ర పాలిటిక్స్ లో కి ఎంట్రీ అవరు. 2018 లో తెలంగాణలో ఓటేసి, 2019 లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఓట్లు వేసిన వారు చాలా మందే ఉన్నట్లు తెలుస్తోంది.

కానీ తెలంగాణలో సెటిల్ అయినా వారు అందరూ టీడీపీ అభిమానులు ఉండి ఉండకపోవచ్చు. అందులో వైసీపీకి చెందిన అభిమానులు కూడా ఉండే ఉంటారు. జగన్ కచ్చితంగా గెలవాలని గత ఎన్నికల్లో చాలా మంది అనుకున్నారు. అనుకున్న విధంగానే సీఎంగా జగన్ గెలిచారు. గతంలో జగన్ గెలవాలని రెడ్లలో ఉన్నంత కసి ఇప్పుడు లేదు. ఏపీలో ప్రస్తుతం సంక్షేమ పథకాలు అప్పుల తోనే నడుస్తున్నాయి. రేపటి ఎన్నికల్లో చంద్రబాబు, పవన్, జగన్ ఎవరూ గెలిచిన అప్పులు తీసుకొచ్చి మరీ సంక్షేమ పథకాలను అందజేయాల్సిందే.

అయితే ముందస్తుకు వెళ్లాలంటే చాలా వరకు గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. గతంలో సీఎం కేసీఆర్ ముందస్తుకు పక్కా ప్లాన్ తో వెళ్లారు. ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికలు ఒకే సారి జరిగితే టీఆర్ ఎస్ ఓడిపోయే అవకాశం ఉందని సర్వేల ద్వారా తెలుసుకున్నారు. ఎందుకంటే కేంద్రంలో మోదీ హవా పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎమ్మెల్యే లకు పడే ఓట్లు కూడా బీజేపీకి తరలిపోతాయని భావించి ముందస్తుకు వెళ్లినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

అనుకున్నట్లు గానే అక్కడ ముందస్తులో టీఆర్ ఎస్ గెలిచింది. కానీ సాధారణ ఎన్నికల్లో 9 ఎంపీ సీట్లకే పరిమితమైంది. అంటే జగన్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే బలబలాలు, గెలుపొటములు కచ్చితంగా బేరీజు వేసుకొని అడుగు వేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: