వైసీపీపై మైండ్‌గేమ్‌ వార్‌.. ఏది నిజం?

అయిదారు రోజుల నుంచి ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి వివిధ రకమైన వార్తలు చక్కర్లు కొట్టాయి. సోషల్ మీడియాలో వైసీపీ ముందస్తు ఎన్నికలకు పోతుందని ఒకరు, లేదు మంత్రి వర్గంలో భారీ మార్పులు జరగనున్నాయని ఇంకొకరు, ఇలాంటి ప్రచారాలు విచ్చలవిడిగా జరిగాయి. ఈ అపోహల మధ్యనే ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమావేశం ముగిసిపోయింది.  


అయితే ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ ఛార్జిలతో  సీఎం జగన్ మాట్లాడుతూ.. మీకు మళ్లీ అవకాశం ఇస్తాను. అది మీ పని తనాన్ని బట్టి అని చెప్పుకొచ్చారు.  గతంలో చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ చెప్పినట్లు అక్కడున్న ఎమ్మెల్యేలు అనుకున్నట్లు తెలుస్తోంది.  వసంత కృష్ణ ప్రసాద్ సొంత పార్టీ నేతలపైనే విరుచుకుపడ్డారు. మైలా వరంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి బాధ్యులు మా పార్టీలో వేరే పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై మైనింగ్ శాఖ మంత్రి పట్టించుకోవడం లేదా.. సర్కారు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఆళ్ల రామకృష్ణ రెడ్డిది కూడా  అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరిగింది. జగన్ పెట్టిన మీటింగ్ కు డుమ్మా కొట్టడంతో ఈయనపై విపరీతమైన అనుమానాలు వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేనలోకి వెళుతున్నట్లు తెలుస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేశారు. కానీ ఈయన ఏ పార్టీలోకి వెళ్లే రకం కాదని తెలుస్తోంది. కుమారుడి పెళ్లి పనుల్లో బిజీగా ఉండి మీటింగ్ కు రాలేకపోయాయని చెప్పడంతో అందరి నోర్లు మూయించిన వారయ్యారు.


అందరూ ఊహించిన విధంగా ఏమీ జరగకపోయినా వచ్చే ఎన్నికల్లో కొంతమంది పని చేయని ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవని మాత్రం నిరూపణ జరిగిపోయింది. వాళ్లు అర్థం చేసుకుని ముందుగానే పక్కన ఉండే పార్టీలతో టికెట్ కన్పర్మ్ చేసుకుంటేనే మంచిదని, లేకపోతే ఎటు కాకుండా మధ్యలో మిగిలిన వారుగా ఉండాల్సిన పరిస్థితి వస్తుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: