ఆ మంత్రిని సీఎం జగన్‌ పీకేస్తున్నారా?

జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చినపుడు నుంచి ఒక ఫేక్ న్యూస్ బయటకు వచ్చింది. జగన్ ఢిల్లీకి ముందస్తు ఎన్నికల కోసమే వెళ్లారని ఒకరు. లేదు అవినాష్ రెడ్డిని సీబీఐ కేసు నుంచి తప్పించడానికే అని మరికొందరు ఇలా ఇష్టమొచ్చినట్లు వార్తలు రాసుకొచ్చారు. ఇక యూట్యూబ్ చానళ్లలో నైతే ఏదీ పడితే అది రాసేస్తున్నారు.  సీఎంవో ఆఫీసుకు సీదరి అప్పలరాజును పిలిపించారు. అనంతరం తమ్మినేని కూడా పిలిపించారని వార్తలు టీడీపీ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టాయి.

సీదరి అప్పలరాజును మంత్రి వర్గం నుంచి తొలగించి తమ్మినేనికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం చేసుకొచ్చారు. టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో ఒక ఫేక్ ప్రచారాన్ని చేశారు. రెండు సార్లు సీదరి అప్పలరాజును సీఎంవోకు పిలిపించారని కూడా తెగ వైరల్ చేశారు. మొత్తం మంత్రి వర్గమే మారిపోతుందని కూడా వైరల్ చేశారు.

అయితే ఆయన డాక్టర్ అచ్చెం సంతాప సభకు వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ జగన్ ను కలిసినట్లు ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్లు వార్తల్ని ఓ దినపత్రిక రాసుకొచ్చింది. కానీ సీఎంవో ఆఫీసు వాళ్లే ఆశ్చర్యపోయే వార్తల్ని వీరు రాస్తున్నారు. అక్కడికి రాని వారి గురించి కథనాలు రాశారని అధికారులు ఆశ్చరపోయినట్లు తెలుస్తోంది. ఒక వేళ మంత్రి పదవి పోయినా నాకున్న ఎమ్మెల్యే పదవి అయితే పోదుగా అది అలానే ఉంటుందని సీదరి అప్పలరాజు ఎక్కడో అన్నారు.

దీన్ని పట్టుకుని పూర్తిగా మంత్రి వర్గాన్నే మార్చుతున్నారు. అని కథనాలు అల్లేశారు. సోషల్ మీడియాలో, ముఖ్యంగా రాజకీయ నాయకుల పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో ఇలా జరగడం షరా మామూలు అయిపోయింది. ఇలాంటి ఫేక్ న్యూస్ ల కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఏమీ జరగకున్నా ఏదో జరిగిపోయినట్లు అనవసర విషయాలన్ని బయటకు ప్రచారం చేస్తుంటారు. కొన్ని సమయాల్లో అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా నమ్మే వార్తలు కూడా నమ్మలేని విధంగా మారుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: