వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

రాజకీయం ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఫ్లెక్సిబుల్ గానే ఉంటుంది. అందుకు నిదర్శనమే కర్ణాటకలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ జరుగుతున్న పరిణామాలు. కర్ణాటకలో ఒక్కలిగలకు రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్యమాన్ని ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్. దాన్ని దెబ్బతీయడానికి లింగాయతలుకు, ఒక్కలిగలకు రిజర్వేషన్ పెంచుతూ ముస్లింలకు రిజర్వేషన్లు తీసేసింది బిజెపి. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రాజెక్ట్ చేస్తుందంటే ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ ని వాళ్ళకి ఇస్తున్నారు అంటూ రచ్చ చేసింది.  అక్కడ ఒక కులాన్ని తృప్తిపరుస్తుంటే ఇంకో కులాన్ని రెచ్చగొడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో క్రిందటిసారి కాపు రిజర్వేషన్ ఇస్తామని చంద్రబాబు అంటే బీసీలు దూరమయ్యారు. ఇవ్వనన్నటువంటి జగన్ కు ఓటేశారు.  ఈ టైంలో ఓ కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఏదైతే రిజర్వేషన్ సంబంధించి అసెంబ్లీలో చేసిన తీర్మానం కన్వర్టెడ్ క్రిస్టియన్, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే కన్వర్ట్ అవుతారో వాళ్లకి రిజర్వేషన్స్ వర్తింప చేసేటటువంటిది దానికోసం సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ వరకు రాజ్యాంగ ధర్మాసనం వరకు వెళ్లినా తోసిపుచ్చింది గతంలో. కానీ ఊరకనే మళ్లీ జనాలకు కన్నీళ్లు తుడవడం కోసం శాసనసభలో తీర్మానం చేసి పెడతారు.

అట్లాగే ఏదైతే అనంతపురం ఆ ప్రాంతాల్లో బోయ, వాల్మీకి కమ్యూనిటీలకు రిజర్వేషన్లు గతంలో ఇస్తామని టిడిపి చెప్పుకొచ్చింది. కానీ ఇవ్వలేదు. వాళ్ళని ఎస్టీల్లో చేర్చడం అనేది కొత్తగా సాధ్యం కాదు. 8మంది గిరిజన ఎమ్మెల్యేలు వైసీపీ తరఫున గెలిచారు కిందటిసారి. టిడిపి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఒకే ఒక్క సీటు మాత్రమే ఎస్టీ ఏరియాలో టిడిపి గెలుచుకుంది.

మిగతా ఏడు అప్పుడు కూడా వైసిపి నే గెలుచుకుంది. ఇప్పుడు 8 మంది వైసీపీ తరఫున ఉన్న ప్రభుత్వ ప్రతినిధుల ఫోటోలు పెట్టి గిరిజన బోయ, వాల్మీకులను ఎస్.టి లో చేర్చితే ఆదివాసీల మనుగడకు తీవ్రమైన ముప్పు అయినా కనీసం నోరు మెదపని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అంటూ రేజ్ చేసుకుంటూ వాళ్ళ ఫొటోస్ తో సహా బాగా హైలైట్ చేస్తున్నారు. ఇదే రాజకీయం అంటే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: