జగన్‌కు శ్రీదేవి రిటర్న్‌ గిఫ్ట్‌.. ఇలా ఉండబోతోందా?

వైయస్సార్  కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే శ్రీదేవిని  రెబల్ ఎమ్మెల్యే అనకూడదు. ఎందుకంటే ఆవిడ సస్పెండ్ చేసిన తర్వాత తిరగబడింది కాబట్టి సస్పెండెడ్ ఎమ్మెల్యే అనడం మాత్రమే సమంజసం. ఆవిడ మాటలో చెప్పాలంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అనాలి ఆవిడని. ఆవిడ మొన్న "నన్ను టార్గెట్ చేశారు అసలు రహస్యంగా జరిగే ఓటింగ్ ఎలా ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ఈ విషయం మీద కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పేది ఏంటంటే ఆవిడ తనకు పరువు నష్టం జరిగిందనుకుంటే క్రిమినల్ ఇంకా సివిల్ ఈ రెండు పద్ధతుల్లో ప్రభుత్వం పై పరువు నష్టం దావా వెయ్యవచ్చు అనే విషయం చెప్తూ, వేస్తే గనక  ఆధారం చూపించాలి కోర్టుకు లేకపోతే కేసు అవుతుంది. అలాంటిది ఏమైనా, అలా ఏమైనా లీగల్ గా వెళ్తారా! అదేనా వైసిపికి ఆవిడ ఇచ్చే రిటర్న్ గిఫ్టా అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.

లేదు అంటే అమరావతిలో ఉద్యమంలో పాల్గొంటే అది రిటర్న్ గిఫ్ట్ అవ్వదు. ఎందుకంటే అమరావతి ఉద్యమం వాళ్లు ఈవిడను అసలు ఓన్ చేసుకోవడం లేదు. వాస్తవంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వగానే ఇప్పుడు రఘురామకృష్ణం రాజు అంతకుముందు మామూలుగా ఉండే వాళ్ళు, అంతకుముందు వైసీపీపై తిరుగుబాటు చేశాక ఆయన్ని కడుపులో పెట్టి చూసుకున్నారు అమరావతి రైతులు. అట్లాగే కోటంరెడ్డి అంటే కూడా వాళ్ళకి బాగా అభిమానం. అలాంటి వాళ్ళు దగ్గరికి తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు.

ఎందుకంటే అమరావతి ప్రాంతంలో శ్రవణ్ కుమార్, ఆయన కూడా దళిత నాయకుడే. అక్కడ కీలకమైనటువంటి పాత్రను ఆయన పోషిస్తున్నాడు. అలాంటి మనిషి ఈమెను ఎంకరేజ్ చేయడానికి ఒప్పుకోవడం లేదు. కాబట్టి రిటర్న్ గిఫ్ట్ అంటే ఈ పరువు నష్టం కేసా లేకపోతే ఇంతకుముందు అనుకున్నట్టు రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లి తద్వారా ఆ రకంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా అనేటువంటిది రాజకీయ విశ్లేషకుల సందేహం ఏం చేస్తారో రాబోయే కాలంలో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: