జెలెన్‌స్కీపై ఉక్రెయిన్ సైనికుల తిరుగుబాటు?

అమెరికా, యూరప్ దేశాల నుంచి ఉక్రెయిన్ కు  ఆయుధాలు రావడం లేదు. యుద్దంలో పోరాడాలంటే కావాల్సిన ఆయుధాలు ఇవ్వడం లేదు. ఆహారం పంపించడం లేదు. రష్యా తీవ్ర దాడులు చేస్తుంది. కనీసం వారికి సమానంగా పోరాటం చేయాలనుకుంటున్న సైనికులకు సరైన ఆహారం కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పంపడం లేదు. దీంతో వారి నుంచి తిరుగుబాటు మొదలైనట్లే కనిపిస్తోంది.

బాగ్ పుత్ ప్రాంతంలో ఉన్న ఉక్రెయిన్ సైన్యం తమకు ఆహారం పంపించాలని అధ్యక్షుడిని వేడుకుంది. దీనికి ఆయన స్పందించలేదు. దీంతో అక్కడ సైన్యానికి లీడర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి తిరిగి వచ్చేశాడు. సైన్యం ఆకలితో అలమటిస్తూ ఉంటే ఎలా యుద్ధం చేస్తుందని నిలదీశాడు. ఒక వైపు ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతుంటే కనీసం తినడానికి తిండి కూడా పంపించరా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

దీంతో అతడిని జెలెన్ స్కీ సైన్యాధికారి పదవి నుంచి తొలగించాడు. ఇక్కడ సైనికులకు తిండి పెట్టండి అని అడిగినందుకే అధికారిని తొలగించాడని బాగ్ పుత్ లో విధులు నిర్వర్తిస్తున్న 1000 మంది సైనికులు తమ విధులను బహిష్కరించారు. వెనక్కి తిరిగి వచ్చేశారు.  ప్రాణాలకు తెగించి పోరాడుతున్న మా అధికారిని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటపుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు మనసు పెట్టి ఆలోచిస్తే బాగుంటుందని సైనికులు అభిప్రాయ పడుతున్నారు.

పోరాడేందుకు ఆయుధాలు లేవు. తినడానికి తిండి లేదు. నిద్రాహారాలు మాని పనిచేస్తున్నా విధుల నుంచి ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం 1000 మంది విధుల నుంచి తప్పుకోవడం చూస్తుంటే జెలెన్ స్కీకి తిరుగుబాటు మొదలైనట్లే అనిపిస్తోంది. ఇప్పటికైనా అమెరికా, యూరప్ దేశాల నుంచి సరైన ఆయుధాలను సమకూర్చుకుని ముందుకు సాగితేనే ఉక్రెయిన్ సైనికులు పోరాడతారు. లేకపోతే తిండికి నోచుకోకుండా యుద్ధం చేయాలంటే ఎవరికైనా అసాధ్యమే. ఇంతలా పోరాడుతున్న సైనికులపై కనికరం చూపకపోవడం జెలెన్ స్కీకి తగదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: