నీతులు చెప్పే అమెరికా అసలు సంగతి ఏంటి?

చాలా దేశాల్లో సక్రమంగా మానవ హక్కులు లేవనీ, అలా లేని దేశాల్లో భారతదేశం ఒకటని, హిజాబ్ వివాదం లేక బుల్డోజర్లతో చేసేటువంటిదో దుర్మార్గం కాబట్టి అక్కడ మన హక్కులు మంట కలిసిపోతున్నాయి అని అమెరికా ఇచ్చిన తాజా నివేదిక సారాంశం. ఇది ఇప్పుడు ఒక రకంగా సంచలనం సృష్టిస్తున్న విషయం. వాస్తవంగా చెప్పాలంటే రష్యా ఏమో వార్ క్రైమ్స్ విషయంలోనూ, ఇరాన్ హిజాబ్ వివాదంలోనూ, చైనా జింజియాంగ్ విషయంలోనూ, భారత్ లో బుల్డోజర్ వ్యవస్థ విషయంలోనూ మానవ హక్కులు తప్పాయట.

2021 మానవ హక్కుల మీద అమెరికాకు సంబంధించి యూ.ఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అప్రూవల్ ఫారెన్ అసిస్టెన్స్ ఆఫ్ యాక్ట్ క్రిందన 1961 చట్ట ప్రకారం, ట్రేడ్ యాక్ట్ 1974 తో కూడా కలిపి ఈ నివేదిక తయారు చేశారట. దీని ప్రకారం మానవ హక్కులు తక్కువగా ఉన్న దేశాలతో వీళ్ళు వ్యాపారాలు, ఒప్పందాలు తగ్గించుకుంటారని వాళ్ళ ఉద్దేశం. అమెరికన్ రిపోర్ట్స్ లో ఉన్న ఈ విచిత్రమైనటువంటి పాయింట్స్ మీదనే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మండిపడేది. ఎవరు తిట్టినా వాళ్ళు ఏమీ పట్టించుకోరు. పెంటగాన్ యుద్ధ నేరాన్ని అసలు అమెరికా ఏనాడైనా విచారించిందా?  

క్యూబా లోని ఒంటానమాలో అమెరికా  ఆధిపత్యం కోసం అక్కడున్న జనాన్ని జైల్లో తీవ్రంగా హింసించినటువంటి విషయం ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాలరాసి ఆ దేశంలోనే నిర్బంధ కేంద్రాలు నడిపినటువంటి విషయం ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. అదే సందర్భంలో ఇరాన్ లో  కూడా జంతువుల్ని కట్టినట్టు మెడకి గొలుసులు వేసి జనాల్ని కట్టిన విజువల్స్ కూడా అప్పట్లో వెలుగులోకి వచ్చినటువంటి విషయం కూడా గుర్తు చేస్తూ, ప్రపంచంలోనే మానవ హక్కులంటూ ఎవరైనా ఆడించారంటే అది అమెరికానే కానీ మానవ హక్కుల గురించి పోచికోరు ఉపన్యాసం చెప్పమంటే అమెరికా చెప్తుంది అనేటువంటి విషయాన్ని ప్రపంచం మొత్తం మీద అమెరికా మీద ఆగ్రహం వ్యక్తం చేసే వాళ్ళు రైజ్ చేసి చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: