ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

ఉక్రెయిన్ సైనిక ప్లాటూన్లను రష్యా కూల్చేస్తుంది. భీకరమైన దాడులతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. డొనెట్స్క్ ప్రాంతంలో దాగి ఉన్న ఉక్రెయిన్ సైన్యాన్ని రష్యా వెంటాడి వేటాడి చంపేస్తోంది. ఉక్రెయిన్ అంతటా రష్యా దాడులు బీభత్సంగా జరుగుతుంటే సైన్యం అడవుల్లోకి వెళ్లి దాక్కోవాల్సిన పరిస్థితి. అయితే అడవుల్లో దాక్కున్న వారిని రష్యా జల్లెడ పడుతోంది. ఉక్రెయిన్ సైనికులు దాక్కున్న స్థావరాలను డ్రోన్లతో గుర్తిస్తూ ఆయా ప్రాంతాల్లో యుద్ధ ట్యాంకులు, మిస్సైల్స్, బాంబులతో విరుచుపడి వారి ప్రాణాలను తీస్తోంది.

మొన్నటి వరకు ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధంలో చాలా వరకు ఉక్రెయిన్ సైనికులు పోరాటం చేశారు. దాడులను పెంచిన పుతిన్ ప్రభుత్వం ఏ మాత్రం తగ్గడం లేదు. యుద్ధంలో ముందుకు దూసుకుపోతూనే ఉంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ లోని మరియపోల్ ప్రాంతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటించడం అతి పెద్ద సంచలనంగా మారింది.

యుద్ధం జరుగుతున్న వేరే దేశం భూ భాగంలోకి మరో దేశ అధ్యక్షుడు వెళ్లడం అనేది చరిత్రలో నిలిచిపోతుంది. మరియపోల్ లో ఉన్న రష్యన్ సానుభూతిపరులను కూడా కలిశారు. ఇన్ని రోజులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఏ విధంగా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. ఇంతలా యుద్ధంలో ఆధిపత్యం కొనసాగిస్తున్న రష్యాను ఎదుర్కొవడం ఉక్రెయిన్ వల్ల కావడం లేదు.

ఇప్పటికే చాలా ప్రాంతాలను కోల్పోయి దిక్కులేని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆదుకుంటాం, అండగా ఉంటామని హామీ ఇచ్చిన ముందుకు తోసిన అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాలు సరైన ఆయుధాలు ఇవ్వకుండా ఉక్రెయిన్ దేశంతో ఆటలాడుతున్నాయి. ఉక్రెయిన్ పై ప్రస్తుతం భీకరమైన దాడులను రష్యా కొనసాగిస్తూనే ఉంది. విధ్వంస కాండలో చాలా మంది సైనికులు మరణిస్తున్నారు. ఎక్కడ చూసిన బాంబు దాడులతో ఆయా నగరాలు రక్తమోడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి. ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు అందించకపోతే యుద్ధంలో ఓడిపోక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: