అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

అమెరికా బ్యాంకుల ఆర్థిక సంక్షోభం ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. 1929 లో గ్రేట్ డిప్రెషన్ లో పడింది. 1987 లో బ్లాక్ మండే, 2000 సంవత్సరంలో డాట్ కామ్ క్రాష్ అనే సమస్య, 2008 లో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. అంటే ఇప్పటికే నాలుగు సార్లు అమెరికా పెద్ద ఆర్థిక విపత్తులనే ఎదుర్కొంది. అమెరికా ఎదుర్కొందంటే ప్రపంచ దేశాల్లో కూడా దాని ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది.

అమెరికాలో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు ను ముందుగా సరి చేసింది. 11 బ్యాంకులు కలిసి ఈ ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు కు డబ్బులు ఇచ్చాయి. దాదాపు 30 బిలియన్ డాలర్ల సాయం చేసినట్లు తెలుస్తోంది. యూరప్ రెగ్యూలేటర్లకు తీవ్ర ఇబ్బంది వచ్చే అవకాశం ఉండేది. ఇప్పటికే యూరప్ రెగ్యూలేటర్స్ అమెరికాను తిట్టిపోస్తున్నారు. సిలికాన్ వ్యాలీ బ్యాంకు డిసాస్టర్ తో మరింత సమస్య వచ్చింది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు కు సంబంధించి అమెరికా డిపాజిట్లను ఎలా వాడాలి అనే దాన్ని ఇంకా తేల్చలేకపోతున్నారు.

మొత్తం 300 బిలియన్ డాలర్లను పెడరల్ బ్యాంకు నుంచి తెచ్చి సిగ్నిచర్ బ్యాంకు కు స్విట్జర్లాండ్ నుంచి ఇప్పించారు. సిగ్నిచర్, సిలికాన్ బ్యాంకు కు 143 బిలియన్ డాలర్లు ప్రభుత్వమే తీసుకుంది. కానీ ప్రభుత్వం కూడా ఇప్పుడు తిరిగిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కానీ బెయిల్ అవుట్ ప్యాకేజీ తరఫున ప్రపంచ దేశాల నుంచి డబ్బులు ఇప్పిస్తుంది. ఇది తాత్కాలికంగా చేస్తున్న పనే. కానీ శాశ్వతంగా ఈ సమస్యకు అమెరికా పరిష్కారం చూపలేకపోతుంది.

నాలుగు అతి పెద్ద సమస్యలను ఎదుర్కొన్న అమెరికా, ప్రస్తుతం 2023 లో బ్యాంకుల సంక్షోభంతో మరింత ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటుంది. బ్యాంకులను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బ్యాంకులను కాపాడితేనే అమెరికాతో పాటు ప్రపంచ దేశాలకు మనుగడ సాధ్యమవుతుంది. లేకపోతే ఆర్థికంగా కుదేలై కొట్టు మిట్టాడాల్సిన పరిస్థితి తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: