జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

అమరావతి రైతులు, కోర్టు కేసుల్లో తగులుతున్న ఎదురుదెబ్బల తర్వాత సీఎం జగన్ ఆలోచన సరళి మారినట్లు తెలుస్తోంది. అమరావతిని తయారు చేయలేం. కాబట్టి విశాఖపట్నం నే రాజధానిగా ఉంచాలని నిర్ణయం తీసుకుందామనుకునే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డుపట్టట్లు విశ్వసనీయ సమాచారం. రామకృష్ణ టవర్స్ లో క్యాపిటల్ పెట్టుకుని దీన్నే అడ్మినిస్ట్రేషన్ రాజధానిగా గుంటూరు, విజయవాడలో ఉంచాలని అనుకున్నట్లు, వైజాగ్ లో అసెంబ్లీ పెట్టాలని, కర్నూల్ లో హైకోర్టు అనే కాన్పెస్ట్ ను ఉంచుదామని సీఎం అన్నట్లు తెలుస్తోంది.

కానీ ఆ సమయంలో ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అడ్డుకున్నట్లు సమాచారం. రాయలసీమ ప్రాంతంలోనే కాదు. విశాఖ లేకపోతే ప్రజలను సాటిస్పై కారు. మనకు నెగటివ్ గానే ప్రచారం చేస్తారని జగన్ తో వాదించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా మూడు రాజధానుల అంశం ఏపీలో వైసీపీని ఇరాకాటంలో పడేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక సారి మూడు రాజధానులు, మరో సారి వైజాగ్ రాజధాని, ఇంకోసారి అమరావతే అంటూ ఇలా ఒక స్టాండ్ ను తీసుకోలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి.

రాజధానుల అంశంలో ప్రతి సారి ఏదో వివాదం కొనసాగుతూనే ఉంది. అమరావతిని రాజధానిగా నిర్మించాలంటే కనీసం 20 ఏళ్లు సమయం పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అమరావతిలో భవన నిర్మాణాలు, పాలనకు సంబంధించిన అంశాలు, ప్రతి అంశం ముఖ్యమైంది. పెట్టుబడులు రావాలి. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఎంతో సమయం పడుతుంది.

ఇంత లోపు అక్కడ అభివృద్ధి కనపడకపోతే ప్రజలు ఓట్లు వేయరు. కాబట్టి విశాఖను రాజధానిగా ఎంచుకుంటే ఇప్పటికే డెవలఫ్ అయిన సిటీ కాబట్టి సౌకర్యాలతో పాటు పెట్టుబడులను తీసుకురావచ్చు. ఆ తర్వాత అమరావతి గుంటూరు మధ్యలో అనుకున్న ప్రాంతాన్ని మెల్లిగా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఏపీకి ఒక రాజధాని విషయంలో మాత్రం సరైన ప్రణాళిక లేనట్లే కనిపిస్తోందని విశ్లేషకుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: