మోదీపై అమెరికా నుంచి కుట్ర జరుగుతోందా?

పవన్ కళ్యాణ్ జగన్ గురించి అన్నమాట గుర్తుంది కదా, జగన్ ని మరొకసారి ముఖ్యమంత్రిని కానివ్వను అని. అలానే సోరోస్ సంస్థ కూడా భారతదేశానికి మోడీ మళ్లీ ప్రధానమంత్రిని కానివ్వను అన్నట్లు తెలుస్తుంది. ఇది ఇచ్చేటువంటి ఫండింగ్ తో ఇండియాలో సోషల్ మీడియా వింగ్ ఒకవైపు, మెయిన్ స్ట్రీమ్ వింగ్ మరొకవైపు పనిచేస్తున్నాయి. భారతదేశంలో నిధులు కోసం ఎదురుచూసే రాజకీయ నాయకులకు స్వచ్ఛంద సంస్థల ముసుగులో ఇది డబ్బులు అందిస్తున్నట్లుగా తెలుస్తుంది.  

ఈ డబ్బులు తీసుకున్న రాజకీయ పార్టీలు నరేంద్ర మోడీ భారతదేశానికి తిరిగి ప్రధానమంత్రి అవ్వకుండా ఏ విధంగా ముందుకెళ్లాలో ఆ విధంగా కదులుతున్నాయి. భారతదేశంలో తిరిగి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే తమ చెప్పు చేతుల్లో ఉండే కాంగ్రెస్ లాంటి ప్రభుత్వానికి అవకాశం ఉండదు అమెరికా కైనా, చైనాకైనా.

పవన్ కళ్యాణ్ ని తొక్కేయడానికి కొన్ని పార్టీలు ఏ విధంగా ప్రయత్నిస్తున్నాయో అదే విధంగా ఇక్కడ నరేంద్ర మోడీ రాకుండా ఉండడానికి కూడా అమెరికా, చైనా, ఇంకా యూరప్ లు కూడా అలాగే ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకు ఇంత ప్రయత్నం అంటే ఇక్కడ కేంద్రంలో తిరిగి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ఇప్పటికే పరుగులు తీస్తున్న భారత్ మరింత దూకుడు పెంచుతుంది.

అలా మరింత అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఆ తర్వాత ఇంకెవరూ టచ్ కూడా చేయలేరు. అప్పుడు ఈ దేశాల అధిపత్యాలు చెల్లవు, వారి పంతాలు నెగ్గవు. దాంతో అది వాళ్ళకి పెద్ద సమస్యగా కూర్చుంటుంది. గత 3సంవత్సరాల లోనే 50,975 కోట్లు ఇండియాలోకి వచ్చాయి. వాటితో పేద పిల్లల విద్యకు ఏమైనా ఖర్చు చేశారా అంటే అమ్మ ఒడి లాంటి పధకాలతో, అవి రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటున్నాయి కదా. మరి ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అంటే ఈ డబ్బుకు సంబంధించిన అభివృద్ధి ఫోటోలు వరకే పరిమితం అని, వీటి ద్వారా లాభపడేవారు వేరే ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: