పవన్‌, లోకేశ్‌.. ఆ సీక్రెట్‌ తెలుసుకోవాల్సిందే?

నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని ఎలాగైనా అధికారంలోకి తేవాలని పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు పబ్లిక్ రావడానికి మాత్రం టీడీపీ శ్రేణులు కష్టపడాల్సి వస్తుంది. 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న పార్టీకి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని అనుకుంటున్నారు. ప్రజలు వస్తున్నారు అంటే ఎగబడి వస్తున్నట్లు కాదు.

ఎక్కడైతే పాదయాత్ర కొనసాగుతుందో అక్కడికి ప్రజలను తీసుకెళితేనే వస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అదే బాలకృష్ణ వస్తే స్వచ్ఛందంగా వస్తున్నట్లు చెబుతున్నారు. నారా లోకేష్ మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర, వారాహి యాత్ర కూడా కొనసాగి అధికారంలోకి వస్తామని అంటున్నారు.

మచిలీపట్నం లో జనసేన పదో ఆవిర్భావ యాత్రకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. పవన్ బయలుదేరిన నొవాటెల్ హోటల్ నుంచి ఆటోనగర్ వరకు ప్రజలు వచ్చింది ఒక ఎత్తైతే, అక్కడి నుంచి మచిలీ పట్నం వరకు వచ్చిన జనాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. రాష్ట్రం నలుమూలల నుంచి సొంత ఖర్చు పెట్టుకుని వచ్చిన వారే ఎక్కువని ప్రచారం జరిగింది. గుడివాడ, బెజవాడ తదితర ప్రాంతాల్లో హోటళ్లలో ఉండి సొంత ఖర్చులను పెట్టుకుని మరీ జనసేన సభకు వచ్చారు. అంతే పవన్ కల్యాణ్ అంటే ప్రజల్లో ఎంత అభిమానం ఉందో తెలిసిపోతుంది. కానీ ఇదే జనం గతంలో కూడా వచ్చారు.

కానీ పవన్ కల్యాణ్ కూడా గెలవలేరు. అటు లోకేష్ కూడా ఓడిపోయారు. సభలకు వచ్చిన జనంతో ఓట్లు వేయించగలిగితే జనసేన ఏకపక్షంగా గెలిచే అవకాశం ఉంటుందని ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం వల్ల జనసేన గెలుస్తుందా.. జనసేన వల్ల తెలుగుదేశం గెలిచే అవకాశం ఉంటుందా.. అంటే సభకు వచ్చిన జనాల్ని చూస్తే జనసేనతోనే టీడీపీ గెలవగలదనే నమ్మకం కలుగుతోంది. మరి ఈ సారైనా జనాల్ని తమ వైపు తిప్పుకుని ఓట్ల రూపంలో దండుకుంటేనే వైసీపీని ఓడించి టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: