జగన్ హ్యాపీస్‌: పవన్‌, బాబు.. పొత్తు పొడిచేనా?

తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధపడుతూనే కావాల్సినన్ని గౌరవప్రదమైన సీట్లను ఇస్తే ఒకే అనేందుకు జనసేన రెడీగా ఉంది. కాపుల ఆత్మీయ సమావేశంలో హరిరామ జోగయ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు. పొత్తుకు సిద్ధమన్నంతా మాత్రాన 20 సీట్లకే పరిమితం కావాలని అనడం ఎంత వరకు సబబు. ఇలాంటి వ్యాఖ్యల్ని టీడీపీ శ్రేణులు చేస్తుండటంతో జనసేన లో కార్యకర్తలు, నాయకులు కాస్త ఆందోళనకు గురవుతున్నారన్నారు.

అయితే పవన్ సీట్ల విషయంలో తగ్గాల్సిన అవసరం లేదు. గౌరవప్రదమైనవి వస్తేనే పొత్తుకు సిద్ధమని తెలిపారు. మరో జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... జనసేనపై వైసీపీ పార్టీ 100 కోట్లు పెట్టి మరీ విష ప్రచారం చేయిస్తోందని అన్నారు. ఒకే సమావేశం ఇద్దరు జనసేన పార్టీ నాయకులే కానీ చేసిన ఆరోపణలు మాత్రం వేరు.

జోగయ్య టీడీపీ కావాలనే జనసేనను టార్గెట్ చేస్తుందని అంటే నాదెండ్ల మాత్రం వైసీపీ చేస్తున్న కుట్ర అని అన్నారు. ఏదైమైనా 50 సీట్ల ఇస్తే జనసేన టీడీపీతో పొత్తుకు సిద్ధమయినట్లే కనిపిస్తుంది. కానీ టీడీపీ మాత్రం 50 స్థానాలు ఇచ్చేందుకు ససేమిరా అంటోందని రాజకీయ వర్గాల టాక్. పవన్ మాత్రం జగన్ ను గద్దె దించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఎలాంటి సమయంలో తగ్గకూడదని అనుకుంటున్నారు. ఎక్కడా పొత్తు దెబ్బతినకుండా ఓట్లు చీలిపోకుండా ఉంటే ఈజీగా నెగ్గుకురావచ్చని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

హరిరామ జోగయ్య మరో అంశం లేవనెత్తారు. ఎమ్మెల్యే టికెట్లు ఎన్ని తక్కువ ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్ ను అయిదేళ్లు సీఎం క్యాండిడేట్ గా ప్రకటిస్తే చాలని అంటున్నారు. అసలే సీట్లు విషయంలో పంచాయతీ తెగడం లేదంటే..   ఏకంగా పవన్ కే  అయిదేళ్ల  సీఎం పదవే కావాలని  కోరుకోవడం ఉట్టికెగరలేనమ్మా.. స్వర్గానికి ఎగురతానన్నుట్లుంది జనసేన పరిస్థితి. టీడీపీ, జనసేన పొత్తు నిలుస్తుందా.. సీట్లు అనుకున్నవి జనసేన సాధిస్తుందా.. ఆ ప్రాంతాల్లో గెలుస్తుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: