భారత్‌తో ఇంతగా ధనవంతులు పెరిగిపోతున్నారా?

విలాసవంతమైన జీవనానికి భారతీయులు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు డబ్బులు లేవు తిండి దొరకడం లేదని ఏవేవో చెబుతుంటారు. కానీ 80 కోట్ల మందికి ఉచిత బియ్యం అందిస్తున్న దేశం భారత్ అని తెలుసుకోవాలి. దేశంలో ఎక్కువ మంది 3 మిలియన్ డాలర్ల అపార్ట్ మెంట్లు కొనడానికి ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఒక మిలియన్ డాలర్ విలువ చేసే ఇళ్లకు చాలా డిమాండ్ ఉంది. దాదాపు 72 గంటల్లోనే ఇవి అమ్ముడు పోతున్నాయని టాక్.

2022 సంవత్సరంలో న్యూఢిల్లీ, హైదరాబాద్, ముంబాయి లలో లగ్జరీ ఇళ్లు కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు. మెర్సిడెజ్, బెంజ్ కార్లకు విపరీతంగా గిరాకీ పెరిగిపోయింది. అలాగే స్కాచ్ ఎక్కువగా సేవించే వారిలో ప్రాన్స్ తర్వాత భారతీయులే అని తేలింది.  53 లగ్జరీ హ్యండ్ బ్యాగులు ఇండియాలో సేల్ అవుతున్నట్లు తెలుస్తోంది. 8 లక్షల మిలియనీర్లు 1.4 బిలియన్ల మంది కోటీశ్వరులుగా దేశం మారిపోతుందని తెలుస్తోంది.

ధనవంతుల సంఖ్య పెరుగతున్న దేశంగా భారత్ వృద్ధి చెందుతోంది. మలేషియా, సింగపూర్ తర్వాత ఎక్కువగా ధనవంతులు ఉన్న దేశంగా భారత్ మారబోతుంది. ఇళ్లు, కార్లు, హ్యండ్ బ్యాగులు, లిక్కర్, అన్ని బ్రాండ్లు ఉండాలని విలాసవంతంగా జీవనం గడపాలని భారత యువత కోరుకుంటోంది. దీన్ని బట్టి భారత్ లో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.

రాత్రి, పగలు పనిచేసైనా సరే ఎలాగైనా దాన్ని సాధించాలనే కసి యువతలో పెరిగిపోయింది. సంపద అంతా 1 శాతం మంది చేతుల్లో ఉంటే 40 శాతం మంది ప్రజలు విలాసవంతంగా గడిపేందుకు పోటీ పడుతున్నారు. మరో 59 శాతం మంది ఇతరులపై ఎక్కువగా ఆధారపడి బతికేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంత చేస్తుంటే డబ్బులు లేవు. పేదరికంతో దేశం అల్లాడుతుందని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తుంటాయి. నిజమే కావచ్చు కానీ భారత్ ఒకప్పటి పేదరిక దేశం మాత్రం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: