రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం.. అలెర్ట్‌ అయిన భారత్‌?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాలకు ఎంతో నేర్పిస్తోంది. ముఖ్యంగా భారత్ దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలని భారత్ త్రివిధ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహన్ అన్నారు. ఆయుధాలు ఉంటేనే గెలిచేస్తాం అనుకుంటే అది పొరపాటే అవుతుందని ఈ విషయంలో రష్యాను ఉదాహరణగా తీసుకోవచ్చని అన్నారు. అలాగే ఇతర దేశాల మద్దతు ఉంటే గెలుస్తామని అనుకుంటే ఉక్రెయిన్ లాంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

అత్యాధునికమైన ఆయుధాలు ఉన్న రష్యా ఏడాది దాటిపోయిన కూడా యుద్ధంలో ఇంకా గెలవలేదు. ఉక్రెయిన్ నాటో దేశాలు, అమెరికా కలిసి సాయం చేసినా ఇప్పటివరకు అది నష్టపోయింది ఎక్కువ అని చెప్పొచ్చు. అయితే యుద్ధం గెలవాలంటే ఆయుధాలతో పాటు సరైన వ్యుహాం ఉండాలనేది తెలిసిపోతుంది. 30 దేశాలు కలిసి కూడా రష్యాను ఎదిరించలేకపోతున్నాయి.

ఇదే విషయంలో భారత త్రివిధ దళాల అధిపతి అనిల్ చౌహన్ గుర్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 1.5 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆయుధాలను కొనుగోలు చేసుకున్న భారత్ స్వశక్తితో ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. పరాయి దేశంపై ఆధారపడితే యుద్ద సమయంలో చేతులెత్తేస్తే ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుందన్నారు. భారత్ జనాభా పరంగా పెద్ద దేశం, పాకిస్థాన్, చైనాతో సరిహద్దు వివాదాలు ఉన్నాయి.

రష్యా ప్రస్తుతం ఇతర దేశాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. రష్యాకు చైనా రా మెటిరీయల్స్ అందజేస్తుండగా, ఇరాన్ చాటు నుంచి ఆయుధాలను ఇస్తోంది. ఇప్పటికే రష్యా వద్ద ఆయుధాల కొరత నెలకొంది. ఇన్ని సంవత్సరాలుగా ఇతర దేశాలకు ఆయుధాలను సప్లై చేసిన రష్యా ఒక యుద్దం చేయాలంటే సంవత్సర కాలంలోనే ఆయుధ సామగ్రి నిండుకుంది. కాబట్టి యుద్దం వస్తే ఎదురొడ్డి నిలబడాలంటే భారత్ తనకు తానుగా ఆయుధాలను తయారు చేసుకోవాలి. ఇతరులపై ఆధారపడితే రష్యా, ఉక్రెయిన్ ఎదుర్కొంటున్న సమస్యలే ఎదురవుతాయని పేర్కొంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: