ఏపీ వెయిటింగ్‌: ఆ రోజు పవన్‌ ఏం చెబుతారో?

జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రస్తుతం కీలకమైన అంశంగా మారబోతుంది. రాష్ట్రంలోని జన సైనికులు సీఎం పవన్ అని అనడం పరిపాటే. 2019 లో కూడా నేను సీఎం అభ్యర్థిని కాను. కానీ ఎన్నికల్లో చివరకు వచ్చే సరికి నేనే సీఎం అని పవన్ ప్రకటించుకున్నారు. అనంతరం రెండు స్థానాల్లో ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. గతంలో చేసిన తప్పులను ఈ సారి అసలు చేయకూడదని గట్టి పట్టుదలతో ఉన్నారు.

అయితే చివరి నిమిషంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం అని అంటున్నారు. అంటే ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే లేదా అదే పదవిని షేరింగ్ విధానంలో అయితే తీసుకోవాలని జన సైనికులు పవన్ ను ఒత్తిడి చేస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ 10 వ ఆవిర్భావ సభ మచిలీ పట్నంలో జరగబోతుంది. దీనికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ ఏం మాట్లాడతారని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.

సభలో జనసేన వైఖరి పవన్ వెల్లడించనున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మార్చి 14న మచిలీపట్నానికి కిలోమీటర్ దూరంలో సభ ప్రాంగణం ఉండబోతుందని చెప్పారు. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెబుతారా.. లేక పవన్ ఓంటరిగానే బరిలోకి దిగుతారా.. అనే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆశిస్తున్నారు.

జనసేన ఒక వేళ ఒంటరిగా పోటీ చేస్తే దానికి గతంలో ఎన్ని ఓట్లు వచ్చాయి. ఎక్కడెక్కడ పార్టీ బలంగా ఉంది. పవన్ ప్యాన్స్ ఓట్లను రాబట్టడంలో గతసారి విఫలమయ్యారు. ప్రస్తుతం వారిని ఎలా మోటివేట్ చేయనున్నారు. జనసేన పార్టీ పది రోజుల్లో పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది . ఈ పదేళ్లలో పార్టీ సాధించింది ఒక్క ఎమ్మెల్యే స్థానమే. మరి వచ్చే ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ అందుకోవాలంటే పవన్, జన సైనికులు చెమటోడ్చక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: