పీఓకే పై పాక్ కుట్ర.. భారత్ భలే అడ్డుకుంది?
అయితే ఇక్కడ ఒక కొత్త విషయం ఏమిటంటే అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఎంపీలుగా పోటీ చేసే వారికి భారత ప్రభుత్వం డబ్బులు అందజేస్తుందన్న వాదన ఉంది. ఎందుకంటే వీరు ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో ఉంటారు. అమెరికా, బ్రిటన్ లో గెలిచిన ఎంపీలు అనేక రకాలుగా భారత్ కు ఉపయోగపడతారు. దీని కోసం కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ అధికారంలో ఉన్న అక్కడ ఎన్నికల్లో నిల్చొనే ఎంపీలకు డబ్బులు అందజేయడం పక్కా. భారత్ తో పాటు పాక్, చైనా కూడా ఇలాంటి పని చేస్తుంటుంది.
ఎప్పుడైనా పాక్, చైనాతో విభేదాలు వచ్చినపుడు సమస్యలు ఎదురైనపుడు అక్కడ భారత్ మద్దతుతో గెలిచిన వారు మనకు సపోర్టుగా ఉంటారు. చాలా మంది ఎంపీలు ఇలా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. బ్రిటన్ లో గెలిచిన మనకు అనుకూలంగా ఉన్న ఎంపీ ఒకరు పాకిస్థాన్ పై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే బ్రిటన్ లో పాక్ కు అనుకూలంగా మాట్లాడటం మొదలు పెట్టే సరికి మనకు అనుకూలమైన ఎంపీ బ్లాక్ మెన్ ఏఎన్ఐ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆప్గాన్ లో ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషించి ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఆక్రమించుకొని పాక్ చాలా పెద్ద తప్పు చేసిందన్నారు. ఇప్పటికైనా పాకిస్థాన్ నాయకులు పాక్ ఆక్రమిత కశ్మీర్ ను వదిలిపెట్టాలని అన్నారు.