మన కోహినూర్ ఇండియాకు వచ్చేస్తుందా?
కోహినూరు డైమండ్ వివరాల్లోకి వెళితే 105.6 క్యారెట్ల ప్రస్తుత విలువ ఉంటుంది. 400 మిలియన్ డాలర్ల వరకు విలువ చేస్తుంది. 16 వశతాబ్దంలోకి దీన్ని బ్రిటిషర్లు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. 1840 సంవత్సరంలో కోహినూరు ను 11 సంవత్సరాల వ్యక్తి నుంచి ప్రిన్స్ లాక్కున్నారని ప్రచారం ఉంది. ఇదే విషయంలో ఆ డైమండ్ ను గిప్ట్ గా ఇచ్చారని బ్రిటన్ ప్రభుత్వం చెప్పుకుంటుంది.
ఇంకో ప్రచారం ఏమిటంటే ఓడిన రాజు నుంచి దోపిడి చేసి మరి తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా భారత టూరిస్టులు దాన్ని చూడాలని ఇష్టపడితే చూపించడానికి బ్రిటన్ అధికారులు ఇష్టపడేవారు కాదు. భారత ప్రభుత్వం కూడా 2010లో బ్రిటన్ ప్రభుత్వాన్ని కోహినూరు డైమండ్ ను ఇచ్చేయాలని అడిగారు. కానీ అప్పడి బ్రిటన్ ప్రధానమంత్రి కెమెరూన్ ఆ కోహినూరు డైమండ్ ను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
మా దేశానికి అది గిప్ట్ గా వచ్చింది. దాన్ని మమ్మల్ని మీరు ఇచ్చేయమని అడిగితే ఎలా అని బ్రిటన్ ప్రధాని అన్నారు. మరి అంత విలువైన కోహినూరు డైమండ్ ను ఎవరూ ఎవరికి గిప్ట్ గా ఇచ్చారో కూడా చెబితే బాగుంటుందేమో. కానీ చెప్పడం లేదు. ఎందుకంటే ఎవరిచ్చారో చెబితే వారి వివరాలు ఇండియాకు తెలుస్తాయి. అప్పుడు సమస్య తీవ్రతరం అవుతుందని భావించి దాని గురించి చెప్పడం లేదు.