జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?

ఎన్నికలు చేరువవుతున్నా వేళ సీఎం జగన్ తన పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్యకర్తలను సరిగా చూసుకోవడంలో జగన్ విఫలమవుతున్నారు. వైసీపీ కార్యకర్తల్లో అసహనం పెరిగిపోయింది. రెండవ అంశం ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగులు.  వీరి పట్ల ప్రభుత్వ వ్యవహారశైలి బాగా లేదని బయట ప్రచారం జరుగుతోంది.


ప్రభుత్వ ఉద్యోగుల బాధల్ని, భయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుని సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. ఎదురుదాడికి దిగితే నష్టపోయేది జగన్ సర్కారే. జీతాలు సమయానికి ఇవ్వాలి.  పీఎఫ్ లు టైం కు వేయాలి. కానీ వారికి జీతాలు సరైన సమయానికి రాకపోవడం తో సర్కారు పై గుర్రుగా ఉన్నారు.


దీనికి తోడు వచ్చేవి ఎన్నికలు. ప్రజల వ్యతిరేకతకు తోడు ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత తోడైతే అది అధికారానికే ఎసరు తెస్తుంది. దీన్ని సీఎం జగన్ దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. వైఎస్సార్, జనసేన, కాంగ్రెస్, ఉద్యోగులు, బీజేపీ, సాధారణ ప్రజలు అందరూ వ్యతిరేకించబట్టి 2018 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకు పరిమితమైంది.


దీనికి కారణం ప్రజల్లో వచ్చిన తీవ్ర వ్యతిరేకతను టీడీపీ అంచనా వేయలేకపోవడం.. తన అనుకూల మీడియా ఎప్పుడు తానా తందానా అనడంతో గెలుపు నల్లేరుపై నడకే అనుకోవడంతో చంద్రబాబు సీఎం సీటు దిగిపోక తప్పలేదు. ఇప్పడు వైసీపీ పార్టీ జగన్ ది అదే పరిస్థితిలా తయారయ్యేలా ఉంది. ఇప్పటి వరకు చంద్రబాబు, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ, పార్టీల నుంచి వస్తున్న విపరీతమైన ఒత్తిడే కాదు. ప్రభుత్వ ఉద్యోగులు, సొంత పార్టీ కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలా చేయడం వల్లే టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. ఇదే పార్ములాను జగన్ కనక పాలో అయితే 15 నుంచి 16 సీట్లకు పడిపోతారు. కాబట్టి పార్టీ కార్యకర్తల్ని కాపాడుకుంటేనే వైసీపీ పార్టీ అధికారం చేజారకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: