ఆ తప్పు చేస్తే.. చంద్రబాబుకు తిప్పలు తప్పవా?

ఆంధ్రప్రదేశ్ లో టిడిపి, వైసిపి మధ్య జంపింగ్ జలానీలు ఇప్పటినుంచే ప్రారంభమయ్యాయి. టీడీపీ నుంచి వల్లభనేని వంశీ మద్దాల రవి, కరణం బలరాం, వైజాగ్ నుంచి ఒక ఎమ్మెల్యే వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందులో వంశీ చాలా రోజుల నుంచి వైసీపీకి మద్దతుగా ఉంటూనే ఉన్నారు. టిడిపిలో గెలిచి వైసిపికి మద్దతిస్తున్నారు. ఇటు వైయస్సార్ పార్టీ నుంచి టిడిపిలోకి వెళ్లేందుకు కోటంరెడ్డి, ఆనం, మేకపాటి నెల్లూరు జిల్లా నుంచి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.

ఇందులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టిడిపి తనకు అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు.  పార్టీలు మారుతున్నటువంటి ఎమ్మెల్యేల తోటి ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే పోటీదారులుగా ఉన్నటువంటి వారికి పడకపోవడం. ఇలాంటి పరిస్థితి 2019 బుచ్చయ్య చౌదరికి ఎదురైంది. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆయన వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి.

ప్రస్తుతం తెనాలి నుంచి జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే స్థానంలో టిడిపి నుంచి ఇన్నాళ్లుగా పోటీ చేస్తానని భావిస్తున్న వ్యక్తి నష్టపోవాల్సిందే.  జనసేన టీడీపీ కలిస్తే ఆ సీటుని జనసేనకు కచ్చితంగా  అప్ప చెప్పాల్సిందే. ఇలా ఎప్పటినుండో ఎన్నో రోజులు కష్టపడుతూ వచ్చిన రాజకీయ నాయకులకు పొత్తుల వలన పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలు మాజీ ప్రజాప్రతినిధుల కారణంగా అనుకూలమైన స్థానాల నుంచి పోటీ చేయలేకపోతున్నారు.

గెలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓడిపోతేనే అసలు సమస్య.  దీనిపైనే చంద్రబాబును బుచ్చయ్య చౌదరి హెచ్చరించినట్లు తెలుస్తోంది. పార్టీలు మారే కోవర్టు లాంటి వారిని  నమ్మి టీడీపీ మోసపోవద్దని చెప్పారు. కానీ చంద్రబాబు దీనికి అంగీకరిస్తారా? ఒకవేళ వద్దనుకుంటే రేపటి నుంచి ఎవరు రావాలన్న టీడీపీలోకి రాని పరిస్థితి తలెత్తుతుంది. దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: